July 15, 2026

Shruti Haasan : హీరోయిన్‌గా కంటే ఐటంగర్ల్‌గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి

Shruti Haasan : హీరోయిన్‌గా కంటే ఐటంగర్ల్‌గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
Reading Time: < 1 minute
Shruti Haasans Huge Remuneration For Peddi Special Song Higher Than Lead Actress Fee

శృతి హాసన్ స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. హీరోయిన్‌గా కంటే ఐటమ్ సాంగ్స్ ద్వారానే శృతి ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తోందనే వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో గుప్పుమంటున్నాయి. గతంలో ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్, శృతి హాసన్ జోడీ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే సెంటిమెంట్‌ను ‘పెద్ది’ కోసం కూడా రిపీట్ చేయాలని చరణ్ స్వయంగా శృతిని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ సాంగ్ కోసం శృతి హాసన్ ఏకంగా 3.5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం శృతి హాసన్ ఒక సినిమాకు హీరోయిన్‌గా చేసే రెమ్యునరేషన్ రూ. 3 కోట్లు కూడా దాటలేదు. కానీ కేవలం ఒకే ఒక పాట కోసం ఇంత భారీ మొత్తం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హీరోయిన్‌గా నటిస్తే దాదాపు 30 నుంచి 40 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స్పెషల్ సాంగ్ అంటే కేవలం 3 నుంచి 4 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. తక్కువ రోజులు పని చేసి హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువే సంపాదిస్తుండటంతో శృతికి ఇది ‘బంపర్ ఆఫర్’ అనే చెప్పాలి. ఇదివరకు ‘స్త్రీ 2’ లో తమన్నా, ‘కూలీ’లో పూజా హెగ్డే కూడా ఇలాగే ఒక పాట కోసం రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శృతి వారిని మించి ‘పెద్ది’ కోసం వసూలు చేస్తోందట. మేకర్స్ ఈ పాటను సాధారణ ఐటమ్ సాంగ్‌లా కాకుండా సినిమా కథలో కీలక మలుపు తిప్పే ఒక ‘స్పెషల్ క్రేజీ సాంగ్’గా రూపొందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, శృతి హాసన్ ఎనర్జీ చరణ్ స్టెప్పులు కలిసి జూన్ 4న థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.