Reading Time: < 1 minute
Fatigue: ఏ పని చేయకపోయినా మీకూ విపరీతంగా అలసట అనిపిస్తుందా? ఇలా ఎందుకు జరుగుతుందంటే..

కొంతమందికి ఏ పని చేయకపోయినా విపరీతంగా అలసటగా ఉంటుంది. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా అలసట, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. కానీ దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. దీనిని ఒక సాధారణ సమస్యగా భావించి విస్మరిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు ఇలా చేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఏ కారణం లేకుండా అలసటగా అనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో అత్యంత ముఖ్యమైనది శరీరంలో అవసరమైన కొన్ని విటమిట్లు, పోషకాల లోపం.

అలసటకు కారణాలు

నిరంతర బలహీనత, పనిపై ఆసక్తి కోల్పోవడం, తల తిరగడం, కండరాల నొప్పి, ఏకాగ్రత లోపం, వేగంగా అలసిపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కొంతమందికి ఆయాసం, హృదయ స్పందన రేటు పెరగడం, మెట్లు ఎక్కేటప్పుడు తల తేలిపోతున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ఏ విటమిన్ ముఖ్యమైనది?

అలసటను తగ్గించడానికి విటమిన్ బి12 చాలా ముఖ్యం. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడి, నాడీ వ్యవస్థ సజావుగా పనిచేసేలా చేస్తుంది. ఈ విటమిన్ లోపం శరీరంలో ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. దీనివల్ల అలసట పెరుగుతుంది. తగినంత విటమిన్ బి12 పొందడానికి ఆహారంలో పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చేపలు తీసుకోవల్సి ఉంటుంది. మాంసాన్ని కూడా తీర్చుకోవచ్చు. శాకాహారులు ఫోర్టిఫైడ్ ఆహారాలను తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ సప్లిమెంట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేస్తుంటారు. కానీ వాటిని డాక్టర్ సలహా లేకుండా ఉపయోగించకూడదు.

జీవనశైలిలో కొన్ని మార్పులు అవసరం

సరైన నిద్ర, క్రమమైన వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ శరీర శక్తిని పెంచడంలో సహాయపడతాయి. స్క్రీన్ సమయాన్ని అధికంగా తగ్గించుకోవడం, పగటిపూట విరామాలు తీసుకోవడం కూడా సహాయపడతాయి. నిరంతర అలసట కేవలం విశ్రాంతి లేకపోవడం వల్ల మాత్రమే కాదు అది విటమిన్ లోపానికి కూడా ఓ సంకేతం. అందువల్ల ఈ సమస్యను సరైన ఆహారం, జీవనశైలి ద్వారా నియంత్రించవచ్చు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.