Reading Time: < 1 minute
Aadhaar : స్మార్ట్‌ఫోన్‌ల్లో ఆధార్ యాప్ ప్రీ-ఇన్‌స్టాలేషన్‌.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఎందుకంటే

దేశ ప్రజలకు మరింత సులభమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఆధార్ గుర్తింపు కార్డుల తయారీ సంస్థ UIDAI దేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో ఫోన్‌లలో ఇన్‌బుల్‌టుగా ఆధార్ యాప్ ఉండేలా చూడాలని ఐటీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. దీని ద్వారా బ్యాంకింగ్, టెలికాం వెరిఫికేషన్ వంటి సేవలు ప్రజలకు సులభతరం అవుతాయని UIDAI భావించింది.

అయితే తాజాగా ఈ అంశంపై జరిగిన చర్చల్లో యాపిల్, శామ్‌సంగ్ , గూగుల్ వంటి ప్రముఖ సంస్థలుతో UIDAI నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ముఖ్యంగా యూజర్ ప్రైవసీ, డివైజ్ సెక్యూరిటీ, భద్రతాపరమైన ముప్పుల గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

అయితే ప్రభుత్వం ఇలా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఇదే మొదటి సారేం కాదు. గత రెండేళ్లలో ఇలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఇది ఆరోసారి. గత డిసెంబర్‌లో ‘సంచార్ సాథీ’ అనే టెలికాం యాప్‌ను కూడా తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావించింది, కానీ తీవ్ర నిరసనల తర్వాత ఆ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకుంది. మొబైల్ కంపెనీలు ప్రతిసారీ భద్రత, ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.