
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఉదయం అధికారులతో పాలనాపరమైన సమీక్ష నిర్వహిస్తుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు శుక్రవారం నాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఎం.ఆర్.ఐ పరీక్షలు నిర్వహించిన అనంతరం చిన్నపాటి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారం నుంచి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు జనసేన అధ్యక్షుని రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి స్వస్థత చేకూరడానికి కొంత సమయం పడుతుందని, దీర్ఘకాలం పాటు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.