Reading Time: < 1 minute
Regina Cassandra Emotional Instagram Post About Love Life

తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి సినిమాలతో మెప్పించిన అందాల భామ రెజీనా కాసాండ్రా. ప్రజంట్ తెలుగులో అవకాశాలు తగ్గడంతో కొలివుడ్ లో, బాలీవుడ్ లో బిజీగా గడుపుతోంది. మూకుతి అమ్మన్ 2 నయనతారతో కలిసి ఈ సీక్వెల్‌లో నటిస్తున్న రెజీనా. అలాగే ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెక్షన్ 108 మూవీ హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటిస్తున్నారు. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆలోచనలో పడేశాయి. తన 20 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన ఈ భామ, వ్యక్తిగత జీవితం, ప్రేమలోని లోతు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Also Read : Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!

రెజీనా తన పోస్ట్‌లో ప్రేమ గురించి వివరిస్తూ.. ‘ఒకరోజు నన్ను నేను ప్రేమకు పూర్తిగా అప్పగించుకున్నాను. చాలామంది పరిస్థితులకు లొంగిపోవడాన్ని నిస్సహాయత అనుకుంటారు, కానీ ప్రేమ అనేది ఒక నిశ్శబ్ద శక్తి. మనం ప్రేమించబడటానికి అర్హులమని గుర్తుంచుకోవడానికి ప్రతి రోజూ ఒక మంచి రోజే. ప్రేమించడం, ప్రేమించబడటంలోనే నిజమైన ఆనందం ఉంది. దాన్ని కోల్పోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టే, ఆ అనుభూతిని తేలికగా తీసుకోకూడదు’ అని పేర్కొన్నారు. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘కృతజ్ఞతతో ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ అనుభూతి భిన్నంగా ఉంటుంది. నా పాత జ్ఞాపకాలను ఆ దృష్టితో చూసినప్పుడు ఎంతో మార్పు కనిపించింది’ అంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఇక ఈ పోస్ట్ చూసి, ఆమె జీవితంలో ఏదైనా కొత్త మార్పు వచ్చిందా? లేదా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు