Reading Time: 2 minutes
Akshaya Tritiya 2026: ఈ 92 నిమిషాల్లో బంగారం కొంటే మీ ఇంట్లో సిరుల వర్షమే! ముహూర్తాలు ఇవే..!

Akshaya Tritiya 2026: సనాతన ధర్మంలో ‘అక్షయ తృతీయ’కు ఉన్న ప్రాముఖ్యత అపారం. ‘అక్షయ’ అంటేనే తరగనిది అని అర్థం. ఈ రోజున ఏ చిన్న పని ప్రారంభించినా, ఏ వస్తువు కొన్నా అది అనంతమైన ఫలితాలనిస్తుందని మన పెద్దల నమ్మకం. ముఖ్యంగా 2026 అక్షయ తృతీయ నాడు పంచాంగంతో పనిలేకుండా శుభకార్యాలు చేసుకునే ‘ముహూర్తం’తో పాటు, ఐదు శక్తివంతమైన రాజయోగాలు కలవబోతున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Prices: అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!

ఏప్రిల్ 19 లేదా 20? పండుగ ఎప్పుడంటే..

ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో సామాన్యుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే శాస్త్రోక్తంగా:

  • తిథి ప్రారంభం: ఏప్రిల్ 19, ఆదివారం ఉదయం 10:49 గంటలకు.
  • తిథి ముగింపు: ఏప్రిల్ 20, సోమవారం ఉదయం 07:27 గంటలకు.
  • సూర్యోదయ తిథి, ప్రధాన ముహూర్తాలన్నీ ఆదివారం (ఏప్రిల్ 19) నాడే ఎక్కువగా ఉన్నందున, ఆ రోజే పండుగను జరుపుకోవడం అత్యంత శ్రేష్టమని పండితులు స్పష్టం చేస్తున్నారు.

ఆ 92 నిమిషాల ‘గోల్డెన్’ పూజా ముహూర్తం

ఈ ఏడాది లక్ష్మీనారాయణులను, కుబేరుడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం కేవలం 1 గంట 32 నిమిషాలు (92 నిమిషాలు) మాత్రమే ఉంది.

పూజా సమయం: ఏప్రిల్ 19న ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు.

ఈ పవిత్ర సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ లేదా కనకధారా స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.

బంగారం కొనడానికి శుభ ఘడియలు ఇవే

బంగారం కొనుగోలుకు ఈ ఏడాది ఏకంగా 19 గంటల సుదీర్ఘ సమయం అందుబాటులో ఉంది. మీ వీలును బట్టి ఈ కింది సమయాల్లో పసిడిని ఇంటికి తెచ్చుకోవచ్చు:

  • ఉదయం అత్యంత ఉత్తమం (చల్, లాభ్, అమృత్) 10:49 AM నుండి 12:20 PM వరకు
  • మధ్యాహ్నం శుభ ఘడియలు (శుభ్) 01:58 PM నుండి 03:35 PM వరకు
  • సాయంత్రం ముహూర్తం 06:49 PM నుండి 10:57 PM వరకు
  • తెల్లవారుజామున ఏప్రిల్ 20 (సోమవారం) 04:28 AM నుండి 05:51 AM వరకు

అరుదైన రాజయోగాలు – అపారమైన లాభాలు

ఈసారి అక్షయ తృతీయ నాడు స్వాతి, విశాఖ నక్షత్రాలతో పాటు బ్రహ్మ, ఇంద్ర, గజకేసరి, మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు ఏప్రిల్ 20న రవి యోగం కూడా తోడవుతోంది. ఈ కాలంలో బంగారం, వెండి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో అద్భుతమైన లాభాలను ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

దానమే అసలైన ధనం

అక్షయ తృతీయ నాడు కేవలం కొనుగోలు మాత్రమే కాదు, దానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అన్నదానం, లేదా పేదలకు వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. మీ ఆర్థిక ఎదుగుదలకు ఈ అక్షయ తృతీయ ఒక పునాది కావాలని కోరుకుంటూ.. పైన పేర్కొన్న శుభ ముహూర్తాల్లో మీ ఇంట మహాలక్ష్మిని ఆహ్వానించండి.

ఇది కూడా చదవండి: Bank Account: ఖాతాదారులకు చివరి అవకాశం.. ఏప్రిల్ 16 లోపు ఈ పని చేయకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవ్వడం ఖాయం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి