July 15, 2026

30 ఏళ్ల అందమైన అద్భుతమైన నటి.. రోడ్డు యాక్సిడెంట్‎లో స్పాట్ డెడ్

30 ఏళ్ల అందమైన అద్భుతమైన నటి.. రోడ్డు యాక్సిడెంట్‎లో స్పాట్ డెడ్
Reading Time: < 1 minute

30 ఏళ్ల అందమైన అద్భుతమైన నటి.. రోడ్డు యాక్సిడెంట్‎లో స్పాట్ డెడ్

Caption of Image.

జైపూర్: రాజస్థాన్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో యువ నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) మరణించింది. మంగళవారం (మార్చి 24) అర్ధరాత్రి ఆమె ప్రయాణిస్తోన్న కారు జైపూర్‎లోని షిప్రా పాత్ రోడ్డుపై డివైడర్‎ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షిల్ కాలియా అక్కడికక్కడే కన్నుమూసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

 కానీ తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలియా మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. 

ఎంతో భవిష్యత్ ఉన్న హర్షిల్ కాలియా అకాల మరణ వార్త సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. హర్షల్ కాలియా మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, మోడలింగ్‌తో పాటు నటనలోనూ హర్షిల్ కాలియా రాణించారు. ముఖ్యంగా డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ (Crime Next Door) వంటి సిరీస్‌లలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

©️ VIL Media Pvt Ltd.