July 15, 2026

IPL 2026: కావ్యపాప డార్క్ హార్స్ భయ్యో.. లైట్ తీసుకుంటే తాట తీస్తారంతే..!

IPL 2026: కావ్యపాప డార్క్ హార్స్ భయ్యో.. లైట్ తీసుకుంటే తాట తీస్తారంతే..!
Reading Time: 2 minutes
IPL 2026: కావ్యపాప డార్క్ హార్స్ భయ్యో.. లైట్ తీసుకుంటే తాట తీస్తారంతే..!

SRH Uncapped Players 2026: ఐపీఎల్ 2026 (IPL) సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన స్వదేశీ బలగాన్ని పటిష్టం చేసుకుంది. గత సీజన్ ఆశించిన స్థాయిలో సాగకపోయినా, ఈసారి యువ రక్తాన్ని నమ్ముకుని బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా భారత్ తరపున ఇంకా ఆడని ముగ్గురు ఆటగాళ్లు ఈ సీజన్‌లో కీలకం కానున్నారు.

1. హర్ష్ దూబే: స్పిన్ మాంత్రికుడు..

గత సీజన్ చివరలో జట్టులోకి వచ్చిన హర్ష్ దూబే, ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనే ఐదు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వికెట్ తీయడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. విదర్భ జట్టుకు కెప్టెన్‌గా ఉండి విజయ్ హజారే ట్రోఫీని అందించిన అనుభవం అతనికి ఉంది. అక్షర్ పటేల్ తరహాలో పరుగులను నియంత్రిస్తూ వికెట్లు తీయడంలో ఇతను దిట్ట. అంతేకాకుండా, చివర్లో బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించగల సామర్థ్యం ఇతని అదనపు బలం. దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే 12 అర్ధసెంచరీలు సాధించి ఆల్‌రౌండర్‌గా తన ముద్ర వేశాడు.

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

2. అనికేత్ వర్మ: మిడిల్ ఓవర్ల వీరుడు..

మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనికేత్ వర్మ, గత సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 236 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఆడిన 74 పరుగుల ఇన్నింగ్స్ అతని పోరాట పటిమకు నిదర్శనం. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డిలతో కలిసి మధ్య ఓవర్లలో స్కోరు బోర్డును పరిగెత్తించడంలో అనికేత్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల వెసులుబాటు ఉండటం వల్ల జట్టుకు అతను పెద్ద ఆస్తిగా మారాడు.

3. సలీల్ అరోరా: పంజాబ్ పవర్ హిట్టర్..

వేలంలో 1.50 కోట్ల రూపాయల భారీ ధరకు దక్కిన 23 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ సలీల్ అరోరాపై భారీ అంచనాలు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించిన ఇతను, ఒకే ఇన్నింగ్స్‌లో అజేయంగా 125 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్ నాయకత్వంలోని ఈ జట్టులో సలీల్ ఫినిషర్‌గా రాణిస్తే, విదేశీ ఆటగాళ్ల కలయిక విషయంలో జట్టుకు మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయి.

ఇది కూడా చదవండి: షేన్ వార్న్ మాస్టర్ ప్లాన్.. రాజస్థాన్ రాయల్స్ డీల్‌తో తన పిల్లలకు వేల కోట్ల ఆస్తి.. ఎంతో తెలుసా?

ఈ ముగ్గురు యువ ఆటగాళ్లు రాణిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ప్లే-ఆఫ్స్ చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా వీరి మెరుపుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..