Reading Time: < 1 minute
Ss Rajamoulis Varanasi Sets Wow Fans Mahesh Babu Film Showcases Grand Vision

SS Rajamouli Mental Vision for Varanasi Sets: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి తన అద్భుతమైన విజన్‌తో సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం వారణాసి నేపథ్యాన్ని పునర్నిర్మిస్తూ.. మినియేచర్ సెట్స్ రూపంలో ఘాట్లు, వీధులు, ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సెట్స్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. రాజమౌళి విజన్‌కు అభిమానులను ఫిదా అవుతున్నారు.

వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరాన్ని రియలిస్టిక్‌గా తెరపై చూపించడం సాధారణ విషయం కాదు. కానీ ఎస్ఎస్ రాజమౌళి మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఘాట్ల ప్రత్యేకత, వీధుల నిర్మాణం, ఆలయాల వాతావరణం.. ఇలా అన్నింటిని ఎంతో స్పష్టంగా ప్రతిబింబించేలా సెట్స్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక సినిమా సెట్స్ కాకుండా.. ఒక కళాఖండంలా రూపొందుతోంది. రాజమౌళి సినిమాలంటే విజువల్ గ్రాండియర్, డిటైలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో కూడా అదే స్థాయిలో కష్టపడి.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పని చేస్తున్నారని ఈ సెట్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఇతరులు ఊహించలేని విధంగా కథను, విజువల్స్‌ను ఆవిష్కరించడం రాజమౌళి ప్రత్యేకత. ఇప్పుడు వారణాసి సెట్స్ రూపంలో ఆ విజన్ మరోసారి బయటపడింది.

Also Read: Ram Pothineni New Movie: రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఊహించని డైరెక్టర్?

మహేష్ బాబు కెరీర్‌లో వారణాసి అత్యంత భారీ, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమౌళి విజన్, మహేష్ బాబు స్టార్ పవర్ కలిస్తే.. ఈ సినిమా ప్రపంచ స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి వారణాసి మినియేచర్ సెట్స్‌తో రాజమౌళి మరోసారి తన సృజనాత్మకతకు నిదర్శనం చూపించారు. ఈ ప్రాజెక్ట్‌ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇక ఈ విజన్ తెరపై ఎలా కనిపిస్తుందో చూడాలని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.