Reading Time: < 1 minute
Who Is Shirani Baloch In Dhurandhar Meet Bimal Oberoi The Actor Behind The Suspenseful Role

Dhurandhar 2: స్పై-యాక్షన్ మూవీ ‘‘ధురంధర్: ది రివెంజ్’’ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్లు హౌజ్‌ఫుల్ అవుతున్నాయి. ఆదిత్య ధర్ డైరెక్షన్ ప్రతిభ, రణ్‌వీర్ సింగ్, మాధవన్ యాక్టింగ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా సినిమా భారీ వసూళ్లను సాధిస్తోంది. అయితే, ఈ సినిమాలో ‘‘షిరానీ అహ్మద్ బలోచ్’’ రోల్ హైలెట్‌గా నిలుస్తుంది. బలూచిస్తాన్ తిరుగుబాటుదారుడిగా కనిపించే షిరానీ కథను మలుపుతిప్పే క్యారెక్టర్.

షిరానీ బలోచ్ రోల్‌లో నటుడు-నిర్మాత అయిన బిమల్ ఒబెరాయ్ నటించారు. పీకే, టైగర్ 3, పానిపట్ వంటి సినిమాల్లో నటించారు. ధురంధర్ 2లో షిరానీ పాత్ర చిన్నదైనప్పటికీ, కీలక సమయం కథను మలుపుతిప్పే సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ సీన్స్‌లో షిరానీ ఎంట్రీ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఉగ్రవాద నెట్వర్క్‌తో సంబంధం ఉన్న వ్యక్తిగా, పాకిస్తాన్‌లో బలూచ్ తిరుగుబాటుదారుగా కనిపిస్తారు.

పాకిస్తాన్ లీడర్ ప్రేరణ:

షిరానీ రోల్ చాలా మందిని ప్రేరణగా తీసుకుని రాసినట్లుగా చెబుతున్నారు. వీరిలో మౌలానా మహమ్మద్ ఖాన్ షిరానీ నుంచి ఇన్‌స్పైర్ అయినట్లుగా తెలుస్తోంది. మౌలానా ముహమ్మద్ ఖాన్ షిరానీ ఒక పాకిస్తానీ ఇస్లామిక్ పండితుడు, రాజకీయ నాయకుడు. ఆయన తరచుగా తీవ్రవాద భావజాలంతో సంబంధం కలిగి ఉండేవారు. ఆయన జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI)తో సంబంధం కలిగి ఉండేవారు. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ ప్రాంతంలో ఒక పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. 2020లో పార్టీ నుండి బహిష్కరించబడిన తర్వాత, ఆయన JUI-షిరానీ అనే తన సొంత పార్టీని స్థాపించారు. గతేడాది 92 ఏళ్ల వయసులో రెండవసారి వివాహం చేసుకోవడంతో షిరానీ తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు.

ఇదే కాకుండా, షిరానీ పాత్రను చాలా వరకు అక్బర్ బుగ్టి నుంచి ప్రేరణ పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. మొదట్లో పాక్ రాజకీయ వ్యవస్థల్లో శక్తివంతమైన నాయకుడిగా ఉన్న అక్బర్ బుగ్టి, ఆ తర్వాత బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. బలూచ్ వనరులను కొల్లగొడుతున్న పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అయితే, పర్వేజ్ ముషారఫ్ పాలన సమయంలో ఆయనను హత్య చేశారు. హత్య తర్వాత బలూచిస్తాన్ నిరసనలు, తిరుగుబాటుకు చిహ్నంగా మారింది. షిరానీ పాత్ర చాలా వరకు ఈ అక్బర్ బుగ్టిని పోలి ఉంది.