Reading Time: < 1 minute
Swiggy Increased Its Platform Fees Raising Them From %e2%82%b914 99 To %e2%82%b917 58

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. కస్టమర్ల నుండి ఒక్కో ఆర్డర్‌కు వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ. 14.99 నుండి రూ. 17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్‌కు రూ. 2.40 పెంచి రూ. 14.90కి చేర్చిన కొద్ది రోజులకే ఈ పెంపు చోటుచేసుకుంది. ఆగష్టు 2025లో ఆర్డర్లు పెరిగిన దృష్ట్యా స్విగ్గీ కొన్ని ప్రాంతాల్లో ఫీజును రూ.12 నుంచి రూ.14కు పెంచింది. ఇది సుమారు 17% పెరుగుదల. స్విగ్గీ షేర్లు 2.90% పెరిగి రూ. 280.40కి చేరాయి.

Also Read:Akshay Kumar: “అది ఒక అడల్ట్ సినిమా”.. ధురంధర్-2పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ప్లాట్‌ఫామ్ ఫీజు అనేది ఈ ప్లాట్‌ఫామ్‌ల కస్టమర్లు తమ ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై చెల్లించే ఒక స్థిరమైన రుసుము. ప్లాట్‌ఫామ్ ఫీజులు అంటే ఒక కంపెనీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించినందుకు విధించే రుసుములు. ఫుడ్ డెలివరీ బిల్లులో ఇవి చిన్న భాగమే అయినా, చాలా ముఖ్యమైనవి. ఈ ఫీజులు విడివిడిగా చూస్తే పెద్దగా అనిపించకపోయినా, తరచుగా ఉపయోగించే వినియోగదారులకు మరింత భారం కానుంది.