Reading Time: < 1 minute
Hardik Pandya Ferrari Hanuman Chalisa Positive Energy Mi Ipl 2026

Hardik Pandya Reveals Listening to Hanuman Chalisa in His Ferrari: ఇటీవల భారత్ టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ గెలుపు అనంతరం హార్దిక్ పాండ్యా రూ. 12 కోట్ల విలువైన ఫెరారీ సూపర్‌కార్ కొనుగోలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టుకు నాయకత్వం వహించనున్న స్టార్ ఆల్‌రౌండర్ తన కారు కొనుగోలుపై స్పందించాడు. తాను ఫెరారీ కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశాడు. తాను తన ఫెరారీలో ‘హనుమాన్ చాలీసా’ భక్తి గీతాన్ని వింటానని చెప్పాడు. ఓ కార్యక్రమంలో పాండ్యా మాట్లాడుతూ.. హనుమాన్ చాలీసా వినడం వల్ల తనకు సానుకూల శక్తి లభిస్తుందన్నాడు. దేవుడు తనపై దయ చూపాడని చెప్పాడు.

READ MORE: Mohanlal New Movies: లాలట్టన్ లైనప్‌ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!

“నా దగ్గర ఇప్పుడు ఫెరారీ (Ferrari) కారు ఉంది, కానీ అందులో కూడా నేను హనుమాన్ చాలీసా వింటాను. హనుమాన్ చాలీసా ఇచ్చే అద్భుతమైన సానుకూల శక్తిని (Positive energy) మరే ఇతర పాట ఇవ్వలేదు. ఈ విషయంలో అందరూ నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను.” అని హార్దిక్ తెలిపాడు. ఈ విషయం చెప్పగానే అక్కడున్న జనాలు ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ అరిచారు. అనంతరం తాను స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదగడం వెనుక ఉన్న కృషిని వివరించాడు. తాను తన కెరీర్‌ను ప్యూర్ బ్యాటర్‌గా ప్రారంభించానని, దేశంలోని అత్యంత విలువైన క్రికెటర్లలో ఒకరిగా ఎదగడానికి ఎంతో కఠోర శ్రమ, కృషి చేసినట్లు తెలిపాడు. అనంతరం బౌలింగ్‌ వైపు దృష్టి పెట్టినట్లు చెప్పాడు. తనను ఓ వ్యక్తి గుర్తించి రంజీలో అవకాశం ఇచ్చారని వివరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.