
మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో నవీన్ పొలిశెట్టికి అభినందనలు తెలిపారు. ఇటీవల విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రాన్ని చూసిన చిరంజీవి, నవీన్ పొలిశెట్టిని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. ఈ సినిమా అందరికీ బాగా నచ్చిందని చెబుతూ, చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనగనగా ఒక రాజు మంచి విజయం సాధించిందని చిరంజీవి పేర్కొన్నారు. మరో అప్‌డేట్‌లో, సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న దేశభక్తి చిత్రం మాతృభూమి గురించి మేకర్స్ వివరాలు వెల్లడించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ విడుదలైంది.
మరిన్ని వీడియోల కోసం :