Reading Time: 2 minutes
Rythu Bharosa: మరికొన్ని రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. రైతు భరోసా పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి!

Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెలాఖరులోగా రైతుల అకౌంట్లో రైతుభరోసా డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకు పంటల సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రబీ సీజన్‌కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఎన్నికల కారణంగా ఆలస్యమవుతోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.  ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ముందుగా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పథకానికి అర్హులు ఎవరెవరు?

ఈ రైతు భరోసా పథకానికి అందరు అర్హులు కారు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు అయి ఉండాలి. అలాగే రైతు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి. ఆ భూమి దరణి పోర్టల్‌లో తప్పకుండా నమోదై ఉండాలి.

ఇది కూడా చదవండి: మీ వాహనంపై ట్రాఫిక్‌ చలాన్స్‌ ఉన్నాయా..? మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

అలాగే సాగుకు యోగ్యం కాని భూములు (బీడు భూములు, రాళ్లు రప్పలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు) ఉన్నవారు రైతు భరోసా పథకానికి అర్హులు కారని గుర్తించుకోండి.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

ఇది వరకు దరఖాస్తు చేసుకుని సాయం పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి అవసరం లేదు. ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ పథకానికి ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్‌లైన్‌లో. అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

LPG Gas: మీరు సిలిండర్‌ బుక్‌ చేసినా ఇంకా రాలేదా? నో టెన్షన్‌.. ఈ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తుంది!

కావాల్సిన డాక్యుమెంట్లు:

  • పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీ
  • ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
  • బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ కాపీ
  • పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం

ఈ రైతులు ఈ పథకానికి అనర్హులు:

  • తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులు అనర్హులు.
  • వ్యవసాయ యోగ్యం కాని భూమి ఉన్నవారు.(బీడు భూములు, రాళ్లు రప్పలు ఉన్న భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలోని భూములు, కాల్వలు, వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు)
  • ధరణి పోర్టల్‌లో భూమి వివరాలు నమోదు కాని రైతులు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు.
  • వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంత మంది రైతులు అనర్హులు.
  • ఆదాయపు పన్ను చెల్లించే రైతులు.
  • రాజ్యాంగబద్ధమైన పదవులు (ప్రజాప్రతినిధులు) కలిగి ఉన్నవారు.

దేవాలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం వర్తించదు. అయితే పథకానికి సంబంధించిన అర్హత విషయంలో నియమ నిబంధనలు మారుతుండవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలి. లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించడం మంచిది.

ఇది కూడా చదవండి: ఉగాది ముందు మహిళలకు పండగలాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే ఎగబడి కొంటారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి