ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ..ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డిCaption of Image.
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ పట్టణంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని 8వ వార్డులో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకునేందుకు గ్రామ సభల నిర్వహణకు సిద్ధమైందని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ తీగల సునేంద్ర, వైస్ చైర్ పర్సన్ రమేశ్ ఉన్నారు.