Reading Time: < 1 minute
War Rumours Trigger Fuel Panic Long Queues At Petrol Bunks In Chennai

పశ్చిమాసియా యుద్ధం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఇప్పటికే గ్యాస్ సంక్షోభంతో భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. భారత్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. ఇదే భయం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వైపు మళ్లింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో వాహనదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

వదంతులు వ్యాప్తి చెందడంతో తెల్లవారుజాము నుంచే చెన్నైలో పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. దీంతో భారీ ఎత్తున క్యూ లైన్లు ఏర్పడ్డాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెబుతున్నప్పటికీ వాహనదారులు మాట వినిపించుకోవడం లేదు. పెట్రోల్ ట్యాంక్‌లు ఫుల్ చేసుకోవడానికి తరలివస్తున్నారు.

ఇది కూడా చదవండి: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?

చెన్నై సిటీ, వేలచెరి, టీ నగర్, అన్నానగర్‌ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. ఎలాంటి కొరత లేదని సిబ్బంది చెబుతున్నప్పటికీ వాహనదారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముందస్తుగా ఫుల్ ట్యాంక్ నింపుకుని వెళ్తామంటూ ప్రజలు చెబుతున్నారు. అవసరానికి మించి అదనంగా కూడా తీసుకెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. కార్లు, బైకులు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

ఇది కూడా చదవండి: Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ