Reading Time: < 1 minute

భగవద్గీత ప్రింటింగ్ ఖర్చు రూ.3.71కోట్లు.. రూ.50కోట్ల లెక్క ఎక్కడిది?: భూమన కరుణాకర్ రెడ్డి

Caption of Image.

అమరావతి: టీటీడీ భగవద్గీత వివాదం ముదురుతోంది. తిరుమలలో భగవద్గీత పుస్తక ప్రచురణ ఖర్చు ప్రోసీడింగ్ ను  భూమన కరుణాకర్ రెడ్డి బయటపెట్టారు. ఐదు భాషల్లో భగవద్గీత పుస్తకం ప్రింటింగ్ కు రూ. 50 కోట్లు ఖర్చు చేశారని, పెద్ద స్కాం జరిగిందని ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించగా  దీనిపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. అవన్నీ తప్పుడు లెక్కలని తేల్చారు. భగవద్గీత పుస్తక ప్రింటింట్ ఖర్చుల ప్రోసీడింగ్స్ బయటపెట్టారు. 

మొదటి దశలో 52లక్షల 95వేల పుస్తకాల ఖర్చు సుమారు రూ.3.71కోట్లు(రూ. 3కోట్ల 71లక్షల 73వేల 750)  అయ్యింది.. రూ. 50 కోట్ల లెక్క ఎక్కడినుంచి వచ్చిందని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.భ‌గ‌వ‌ద్గీతపై కూడా త‌ప్పుడు ప్రచారాలు చేస్తారా అని తీవ్రంగా మండిపడ్డారు. 

©️ VIL Media Pvt Ltd.