Reading Time: 2 minutes
Smriti Mandhana: బార్బీ ‘డ్రీమ్ టీమ్’లో స్మృతి మంధానా.. తొలి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర

Mattel Barbie Dream Team Announcement: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందానా (Smriti Mandhana) కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ టోయ్ కంపెనీ మాట్టెల్ (Mattel) తన తొలి “బార్బీ డ్రీమ్ టీమ్”లో మందానాను ఎంపిక చేసింది.

ఈ అరుదైన గౌరవంతో ఆమె బార్బీ డ్రీమ్ టీమ్‌లో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె రూపంలో ప్రత్యేకంగా రూపొందించిన బార్బీ డాల్‌ను కూడా విడుదల చేయడం విశేషం.

బార్బీ డ్రీమ్ టీమ్‌లో తొలి క్రికెటర్..

మందానా ఎంపిక మహిళల క్రీడల అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమె సాధించిన విజయాలను గుర్తిస్తూ ఈ ప్రత్యేక బార్బీ డాల్‌ను రూపొందించారు.

ఈ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో గొప్ప విజయాలు సాధించిన మహిళలను గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన మహిళల జాబితాలో భారతదేశాన్ని స్మృతి మంధానా ప్రతినిధిగా నిలిచింది.

బార్బీ డ్రీమ్ టీమ్‌లో ఉన్న ఇతర ప్రముఖులు..

బార్బీ తమ అధికారిక ప్రకటనలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మంది మహిళలను డ్రీమ్ టీమ్‌లో ఎంపిక చేసింది. ఈ లిస్ట్ లో ఎవరెవరున్నారో ఓసారి చూద్దాం..

సెరీనా విలియమ్స్ (Serena Williams) (టెన్నిస్ దిగ్గజం)

కెల్లీ గెరార్డి (Kellie Gerardi) (రీసెర్చ్ ఆస్ట్రోనాట్ / పరిశోధక వ్యోమగామి)

రెజినా సిర్వెంట్ అల్వరాడో (Regina Sirvent Alvarado) (ప్రొఫెషనల్ రేస్ కార్ డ్రైవర్)

క్లోయీ కెల్లీ (Chloe Kelly) (ఫుట్‌బాల్ క్రీడాకారిణి)

హెలెన్ ఫిషర్ (Helene Fischer) (పాప్ కళాకారిణి)

జోజా స్కుబిస్ (Zoja Skubis) (ఎక్స్‌పెడిషన్ క్లైంబర్ / పర్వతారోహకురాలు)

స్టెఫానీ గిల్మోర్ (Stephanie Gilmore) (ప్రొఫెషనల్ సర్ఫర్)

స్మృతి మంధాన (Smriti Mandhana) (భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి)

మహిళల క్రికెట్‌కు మంధానా చేసిన సేవలు..

 

View this post on Instagram

 

A post shared by Barbie (@barbie)

స్మృతి మందానా భారత మహిళా క్రికెట్ ఎదుగుదలకు కీలక పాత్ర పోషించింది. ఆమె భారత మహిళా జట్టులో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. అంతేకాదు, టెస్ట్, వన్డే, టీ20 మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో శతకం సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె రికార్డు సృష్టించింది. ఇది మహిళల క్రికెట్‌కు ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..