
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రికార్డులను తిరగరాసింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్స్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో నెట్టింట హంగామా మొదలైంది.
కొత్త పోస్టర్‌లో పవర్ స్టార్ ‘మాస్’ లుక్
తాజాగా విడుదలైన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బ్రైట్ గ్రీన్ సన్ గ్లాసెస్ ధరించి, చేతిలో గన్ పట్టుకుని ఆయన ఇస్తున్న ఫోజు చూస్తుంటే.. థియేటర్లలో రచ్చ ఖాయమనిపిస్తోంది. పవన్ పక్కనే హీరోయిన్ శ్రీలీల చిరునవ్వుతో ఆయన్ని చూస్తున్న తీరు ఈ ఇంటెన్స్ పోస్టర్‌కు కొంత గ్లామర్‌ను, అందాన్ని జోడించింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ,.. నార్త్ అమెరికాను ఈ ‘ఫైరీ ఎంటర్‌టైనర్’ ఊపేయబోతోంది అని పేర్కొన్నారు. మార్చి 25న అక్కడ గ్రాండ్ ప్రీమియర్స్ జరగనుందని తెలిపారు.
Neelonchi Kotthagaa Nuvve Molakeththagaa…
Gundello Ganthulegaa…✨Celebrating Our HAT-TRICK Association With Our Beloved POWER STAR @PawanKalyan Garu❤️
Bringing The Fire Of #UstaadBhagatSingh To North America🔥
GRAND PREMIERES On 25th MARCH, 2026💥@harish2you @sreeleela14… pic.twitter.com/Mgr3PsEkbl
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 28, 2026
ట్రెండింగ్‌లో ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్!
ఈ సినిమా నుంచి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ బీట్స్‌కు పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్ కెరీర్‌లోనే ఇది ఒక బిగ్గెస్ట్ డ్యాన్స్ హిట్ అని అభిమానులు అభివర్ణిస్తున్నారు. ఈ పాటలోని పవన్ క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రాశీ ఖన్నా నటిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ క్రేజ్, ఆయనతో పని చేయాలన్న కోరికతో స్క్రిప్ట్ కూడా వినకుండానే ఈ సినిమాకు సైన్ చేశాను అని ఈ బ్యూటీ చెప్పింది. అలాగే, షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ.. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమా కోసం సమయం కేటాయించిన పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 26న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు తిరగరాస్తుందో చూడాలి మరి.