
ఉదయ్‌పూర్‌లో ఇటీవల (ఫిబ్రవరి 26న) వివాహం చేసుకున్న నూతన దంపతులు రష్మిక–విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో జరిగిన అల్లు శిరీష్ పెళ్లికొడుకు (హల్దీ) వేడుకకు హాజరయ్యారు. వివాహం అనంతరం భర్త–భార్యలుగా రష్మిక–విజయ్ పాల్గొన్న ఫంక్షన్ ఇదే కావడం విశేషం.
అల్లు శిరీష్ వివాహం మార్చి 6న జరగనుంది. ఈ సందర్భంగా కాబోయే పెళ్లి కొడుకు అల్లు శిరీష్‌ను కొత్త దంపతులైన విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా.. తమ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా కుటుంబ సభ్యులను ఆహ్వానించారు.
ఈ తరుణంలోనే పెళ్లి తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన కొత్త జంటకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు శిరీష్ వివాహం మార్చి 6న జరగనుంది.
విజయ్-రష్మిక రిసెప్షన్..
ఇదిలా ఉండగా, విజయ్-రష్మిక వివాహ రిసెప్షన్‌ను మార్చి 4, 2026న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. తాజ్ కృష్ణ వేదికగా రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి కళ్లు మార్చి 4న జరగబోయే రిసెప్షన్ పైనే పడింది. ఈ వేడుకకు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
ALSO READ : సూర్య కొత్త మూవీ టైటిల్ ఫిక్స్..
అల్లు స్టూడియోస్‌లో శీరీష్ ప్రీ-వెడ్డింగ్!
గతేడాది అక్టోబర్ 31న అత్యంత సన్నిహితుల మధ్య నయనికతో నిశ్చితార్థం చేసుకున్న శిరీష్, అప్పటి నుండే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ జంట తమ స్నేహితులతో కలిసి, హైదరాబాద్, దుబాయ్ నగరాల్లో గ్రాండ్‌గా ‘బ్యాచిలర్ పార్టీ’ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులందరి కోసం హైదరాబాద్‌లోని ‘అల్లు స్టూడియోస్’ వేదికగా ఘనంగా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించబోతున్నారు.