
Sachin Tendulkar: భారత క్రికెట్ ఆరాధ్య దైవం, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ ఈరోజు (ఏప్రిల్ 24) తన 53వ పుట్టినరోజును జరుపుకున్నారు. రికార్డుల రారాజుగా వెలుగొందిన సచిన్, తన పుట్టినరోజును ఎంతో నిరాడంబరంగా, హృదయానికి హత్తుకునేలా జరుపుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా తన పుట్టినరోజున అభిమానులను నిరాశ పరచలేదు. ముంబైలోని తన నివాసం బయటకు వచ్చిన సచిన్, అక్కడ వేచి ఉన్న వందలాది మంది అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అభిమానులు అతడిపై పూలవర్షం కురిపిస్తూ “హ్యాపీ బర్త్‌డే సచిన్” అంటూ నినాదాలు చేశారు. సచిన్ వారితో ముచ్చటించడమే కాకుండా, సెల్ఫీలు దిగి తన ప్రత్యేక అనుబంధాన్ని చాటుకున్నారు.
పోలీసులతో స్పెషల్ సెల్ఫీ:
ఈ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భద్రత కోసం వచ్చిన ముంబై నగర పోలీస్ సిబ్బందితో సచిన్ టెండూల్కర్ స్వయంగా సెల్ఫీలు దిగారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ, సచిన్ చూపించిన ఈ వినయాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
►ALSO READ | FIFA World Cup: ఒక్కో టిక్కెట్ రూ. 21 కోట్లు! : వరల్డ్ కప్ ఫైనల్ చూడాలంటే కోట్లు కావాలి భయ్యా..
శుభాకాంక్షల వెల్లువ:
సచిన్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “నిజమైన భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ అంకితభావం ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని కొనియాడారు.
At Sachin Tendulkar’s birthday celebration, the police officers who came for security there surrounded him to click pictures with him.😄❤️ pic.twitter.com/EKIHTK8awr
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 24, 2026
Sachin Tendulkar celebrating his 53rd birthday, meeting fans and celebrating the occasion with them.❤️ pic.twitter.com/TWxgkYcymK
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 24, 2026