Reading Time: < 1 minute

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

Caption of Image.

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ సందర్భంగా ఈ ముగ్గురిపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011, మార్చి 10వ తేదీన హైదరాబాద్‎లోని ట్యాంక్ బండ్‎పై మిలియన్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. లక్షలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు మీడియా చానళ్ల కెమెరాలను, ఓబీ వ్యాన్‎లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను నిందితులుగా చేర్చారు. 

ఈ కేసును సవాల్ చేస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మిలియన్ మార్చ్ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో తమకు సంబంధం లేదన్నారు. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. దీంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. 

©️ VIL Media Pvt Ltd.