Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీలో సూపర్ వెదర్.. ఉదయం 30 డిగ్రీలు.. రాత్రి 18 వరకు..

Caption of Image.

హైదరాబాద్ సిటీ వెదర్ ఆహ్లాదకరంగా.. హాయిగా.. సూపర్ గా ఉంది. అవును.. హైదరాబాద్ వెదర్ అంటే ఇలా ఉంటుంది అని ఇప్పుడు వాతావరణ చెబుతోంది. మరీ చల్లగా కాదు.. అలా అని మరీ వేడిగా కాదు.. ప్లజెంట్ వెదర్ కండీషన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

హైదరాబాద్ సిటీ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా ఉన్నాయి.. ఇదే సమయంలో రాత్రి టెంపరేచర్ 18 డిగ్రీలుగా నమోదు అవుతుంది. ఉదయం చురుక్కు చురుక్కు అనే వేడి.. రాత్రికి మరీ చల్లగా కాకుండా కూల్ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారు జనం. మొన్నటిదాకా చలి ఎక్కువగా ఉండటంతో ఉదయం ఎనిమిది గంటల దాకా బయటికి రావడానికి భయపడ్డ హైదరాబాదీలు ఇప్పుడు సూర్యోదయం కాగానే బయటికి వచ్చి వెచ్చటి సూర్యకిరణాలను ఆస్వాదిస్తున్నారు. 

చలి తీవ్రత వల్ల ఉదయం సమయంలో వాకింగ్ వెళ్లడం వాయిదా వేసిన చాలా మంది ఇప్పుడు వెదర్ ప్లెజెంట్ గా మారడంతో తమ షూ లేస్ బిగించి బయటికి వస్తున్నారు.మొన్నటిదాకా కోల్డ్ క్రీంలు రాసుకొని, స్వెటర్స్ వేసుకొని ఇంట్లో ఉన్న జనం ఇప్పుడు సన్ స్క్రీన్ లు, మాయిశ్చరైజర్లు రాసుకొని వాకింగ్ కి సిద్ధమవుతున్నారు. అయితే.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికీ 12 నుంచి 18 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని తెలిపింది వాతావరణ శాఖ.   

ఫిబ్రవరి నెలాఖరు వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని.. నెలాఖరు నుంచి సమ్మర్ వైబ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం వాతావరణంలో ఈ మార్పు రావడానికి లో లెవెల్ ఈస్టర్లీస్  కారణమని తెలిపింది వాతావరణ శాఖ. గాలులు తూర్పు నుంచి పడమర వైపు వీచే గాలిలో తేమను  నిలుపుకుంటాయని..వేడి శాతం పెరుగుతుందని తెలిపింది వాతావరణ శాఖ.
 

©️ VIL Media Pvt Ltd.