Reading Time: < 1 minute

Good Health: ఐదు నిమిషాల వ్యాయామం.. గుండె ఆరోగ్యానికి అవసరం..

Caption of Image.

గుండె వేగం పెంచే వ్యాయామాలతోపాటు గుండెకు విశ్రాంతినిచ్చే వ్యాయామాలు కూడా అవసరం.ప్రతిరోజు శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తూ అలసిపోయే గుండెకు నిద్రలో తప్ప విశ్రాంతి దొరకదు. అప్పుడు కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే రక్తప్రసరణ వేగాన్నితగ్గించి గుండెకు సాధ్యమైనంత ఎక్కువ విశ్రాంతినిచ్చే ఎక్సర్సైజ్​లు ఉన్నాయి. వాటితో గుండెకు ఉపశమనం కలుగుతుంది. రోజులో కనీసం ఐదు నిమిషాలు కేటాయించాలి.

 

  • గోడకు దగ్గరగా మ్యాట్ వేసుకుని వెల్లకిలా పడుకోవాలి.
  • ఇలా పడుకున్నప్పుడు మోకాళ్లను మడిచి, పైకి లేపి, పిరుదులు గోడకు తగిలేలా దగ్గరగా జరగాలి.
  • చేతులను వెనక్కి వాల్చేసి, కాళ్లను నెమ్మదిగా నిటారుగా పైకి లేపాలి.
  • పైకి లేపిన కాళ్లను గోడకు ఆనించి, బరువును గోడ మీదే వేయాలి.
  • ఈ భంగిమలో ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకుని, ఊపిరి పీల్చుకోవాలి.
  • ఆ సమయంలో గుండె వేగం తగ్గడం స్పష్టంగా తెలుస్తుంది. ఐదు నిమిషాల పాటు ఉండి నెమ్మదిగా కాళ్లను కిందకి దించి, చేతులు నేల మీద ఉంచి, లేచి నిలబడాలి.

–వెలుగు,లైఫ్​–

©️ VIL Media Pvt Ltd.