Reading Time: 2 minutes
Trisha: త్రిషతో ఉన్నఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే..

పై ఫొటోలో త్రిషతో ఉన్నదెవరో గుర్తు పట్టారా?ఈ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. చాలా మంది హీరోయిన్ల లాగే ఈ ముద్దుగుమ్మ కూడా ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చిన్నతనంలోనే త్రిష, మంజు వారియర్ వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పలువురి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్ లో ఈ అమ్మడి పేరు తెగ మార్మోగిపోతోంది. ఆ మధ్యన ఒక డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన ఈ అందాల తార ఇప్పుడు నేరుగా ఓ తెలుగు మూవీలోనే నటిస్తోంది. సినిమా ప్రమోషన్లు, ఫంక్షన్లలో ఈ ముద్దుగుమ్మ తెగ కనిపిస్తోంది. చక్కని చీరకట్టులో అచ్చం పక్కిటమ్మాయిలా కనిపిస్తోంది. ఈ సొగసరి అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ప్రజెంట్ తెలుగు యూత్ క్రష్ గా మారిపోయిన ఈ క్యూటీ మరెవరో కాదు ఛాంపియన్ హీరోయిన్ అనస్వర రాజన్.

గతంలో పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనస్వర రాజన్. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. తమిళం, మలయాళం, హిందీ భాషల్లో పలు హిట్ సినిమాల్లో నటించింది. అయితే తెలుగు ఆడియెన్స్ కు చేరువైంది మాత్రం రేఖా చిత్రం అనే మలయాళం సినిమాతోనే. ఓటీటీలో వచ్చిన ఈ డబ్బింగ్ మూవీలో అనస్వర అందం, అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అనస్వర కనిపించనుంది. ఇప్పటకే ఛాంపియన్ సినిమా నుంచి రిలీజైన అనస్వర పోస్టర్స్, గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఛాంపియన్ సినిమాలో అనస్వర రాజన్..

 

View this post on Instagram

 

A post shared by Swapna Cinema (@swapnacinema)

ఛాంపియన్ సినిమాకు ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌పై ఈ మూవీని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్‌ బ్యానర్లపై నిర్మించారు. ఛాంపియన్ తో పాటు మీ అర్జున అనే సినిమాలో కూడా హీరోయన్ గా నటిస్తోంది అనస్వర రాజన్. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Abishan Jeevinth (@abishan_jeevinth)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.