Reading Time: < 1 minute
Will The Pushparaj And Srivalli Combo Impress Once Again

టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికలకు పెళ్టైన తర్వాత వస్తోన్న ఫస్ట్ ఫిల్మ్ రణబాలి. ఈ సినిమా ఇద్దరికి స్పెషల్. సినిమా అక్టోబర్ 16న రిలీజౌతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఎన్ని ప్రమోషన్స్ చేసినా.. రష్మికను ఫ్యాన్స్ నేరుగా చూసే అవకాశమున్న ట్రైలర్ లాంచ్ డుమ్మా కొట్టేసింది. రష్మిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను స్కిప్ చేయడంపై విజయ్ దేవరకొండకు మీడియా నుంచి క్వశ్చన్ ఎదురైతే.. ఆమె మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉందని, ఆమెపై నిర్మాతలు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసారని, చాలా మంది యాక్టర్స్‌తో కాంబినేషన్‌ సీన్స్‌ ఉండటంతో డేట్స్‌ వేస్ట్‌ కాకుండా తను షూటింగ్‌లో బిజీగా ఉందని చెప్పడంతో ఓ హింట్ ఇచ్చినట్లయ్యింది.

వందల కోట్లు ప్రాజెక్ట్ అంటే.. మైసా, ఎంఎస్ సుబ్బలక్ష్మీ బడ్జెట్ వంద కోట్లు లోపే కాబట్టి.. రాకా అయ్యింటుందని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. రాకాలో అల్లు అర్జున్‌తో మరోసారి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంటోందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కానీ టీం చెప్పట్లేదు. దీపికా పదుకొణేను తప్పితే మరో హీరోయిన్ పేరు రివీల్ చేయలేదు. నాలుగైదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారన్న స్ట్రాంగ్ గాసిప్ నడుస్తోంది. అందులో రష్మిక ఒకరు. ముంబయిలో షూటింగ్ వల్లే రష్మిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎగ్గొట్టిందని టాక్. పుష్ప సిరీస్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌కు క్రేజ్ ఏర్పడంతో.. అట్లీ ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. ట్రిపుల్ రోల్‌లో బన్నీ నటిస్తున్నాడన్న రూమరే హైప్ క్రియేట్ చేస్తుంటే.. రష్మిక కూడా తోడైతే.. మరోసారి బాక్సాఫీస్ షేక్ అవుతుందేమో లెట్స్ వెయిట్.