Reading Time: < 1 minute

తిరుమలలో స్కూటీపై అన్యమత స్టిక్కర్.. జీఎన్సీ గేటు దగ్గర గుర్తించిన సిబ్బంది

Caption of Image.

తిరుమల కొండపై  అన్యమ‌త స్టిక్కర్ తో కూడిన వాహనం  అలజడి రేపింది. తాజాగా, అన్యమత స్టిక్కర్ అంటించి ఉన్న ఓ వాహనం తిరుమలకు వచ్చింది. అన్యమత స్టిక్కర్​ ఉన్న స్కూటీని జీ ఎన్సీ గేటు దగ్గర సిబ్బంది గుర్తించారు.

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్య మత చిహ్నం స్టిక్కర్‌తో ఉన్న వాహనం తిరుమల కొండపైకి వెళ్లింది.

తిరుమల కొండకు వచ్చే వాహనాలను అలిపిరి చెక్​ పోస్టు దగ్గర క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలి.  అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అన్యమత స్టిక్కర్​ఉన్న  AP 40KR 4130 వాహనాన్ని గుర్తించలేదు. జీఎన్సీ గేటు దగ్గర హోంగార్డ్​ గుర్తించడంతో మరోసారి సిబ్బంది వైఫల్యం బయటపడింది. 

©️ VIL Media Pvt Ltd.