
Bangladesh: భారత్‌లో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)కి బంగ్లాదేశ్‌లో మద్దతు లభిస్తోంది. షేక్ హసీనాను గద్దె దించడానికి హింసాత్మక నిరసనకు పాల్పడిన విద్యార్థి నేతలు ఇప్పుడు సీజేపీకి మద్దతు పలుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) కన్వీనర్ నాహిద్ ఇస్లాం CJPకి మద్దతు తెలిపారు. గతంలో ఈ పార్టీకి చెందిన విద్యార్థి నేతలు భారత్ గురించి అనుచితంగా మాట్లాడారు. భారత్ నుంచి ఈశాన్యంలోని ‘‘సెవెన్ సిస్టర్’’ రాష్ట్రాలను, సిలిగురి కారిడార్‌ను స్వాధీనం చేసుకుంటామని బెదిరించాడు.
శనివారం ఢాకాలో నాహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. ఎన్నికల జవాబుదారీతనం గురించి భారత్‌లో జరుగుతున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువు దీపు చంద్ర దాస్ హత్య గురించి మాట్లాడుతూ.. మైనారిటీలు భయంతో జీవించే సమాజం, నిజమైన ప్రజాస్వామ్య సమాజం కాలేదని అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస జరుగుతున్న నేపథ్యంలో నాహిద్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీశాయి.
గతంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఎన్సీపీ నేతలు భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2025లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, ఎన్సీపీ నేత హస్నత్ అబ్దుల్లాలతో సహా పలువురు భారత్‌కు వ్యతిరేకంగా నిరాధార వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అయిన హిందువులపై ద్వేషం ప్రేరేపించేలా చేశారు. ఈశాన్య రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. ఇప్పుడు ఇదే పార్టీ కన్వీనర్ నాహిద్ ఇస్లాం సీజేపీకి మద్దతుగా మాట్లాడారు.