Reading Time: 3 minutes

Unnimaya Prasad: ఆర్కిటెక్చర్‌ టు యాక్టింగ్‌.. నటి ఉణ్ణిమయ ఇన్‌స్పిరేషనల్ జర్నీ

Caption of Image.

సినిమాల్లో కొందరు నటులు తొలిచూపులోనే గుర్తుండిపోతారు. మరికొందరు నెమ్మదిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదిస్తారు. పాత్ర చిన్నదైనా.. పెద్దదైనా.. తనదైన ముద్ర వేయడం మలయాళ నటి ఉణ్ణిమయ ప్రసాద్‌ (Unnimaya Prasad)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేకత. ‘జోజి’లో బిన్సీగా ఆమె నటనకు విశేష గుర్తింపు వచ్చింది. అయితే ఆమె ప్రయాణం నటనతోనే మొదలుకాలేదు. ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చదువు.. కాస్టింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనుభవం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు.. ఇలా సినిమా ప్రపంచాన్ని పలు కోణాల్లో చూసిన తర్వాత నటిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Unnimaya Prasad (@unnimango)

ఉణ్ణిమయ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదివారు. తిరువనంతపురంలోని కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యను అభ్యసించారు. అయితే చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. అయినప్పటికీ సినిమాల్లోకి వెంటనే వచ్చేయాలని ఆమె తొందరపడలేదు. ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలోనూ పనిచేస్తూనే సినిమాతో తన అనుబంధాన్ని కొనసాగించారు. ఇప్పటికీ నటనతో పాటు ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులు కూడా చేస్తున్నట్టు ఆమె గతంలో చెప్పుకున్నారు. ఇదే ఆమె ప్రయాణంలోని ప్రత్యేకత. చాలామంది నటులు కెమెరా ముందే తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెడతారు. కానీ ఉణ్ణిమయ మాత్రం సినిమా ఎలా తయారవుతుందో తెలుసుకోవడానికి కెమెరా వెనుక కూడా పనిచేశారు. ఒక కథను తెరపైకి తీసుకురావడంలో నటుడితోపాటు దర్శకుడు, కాస్టింగ్ టీమ్, నిర్మాణ బృందం చేసే పనిని దగ్గరగా చూశారు. ఆ అనుభవమే తర్వాత ఆమె నటనలోనూ కనిపించింది.

కాస్టింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తొలి అడుగులు

2016లో వచ్చిన ‘మహేషింటే ప్రతీకారం’ ఉణ్ణిమయ సినీ ప్రయాణంలో కీలకమైన దశ. ఈ చిత్రానికి ఆమె కాస్టింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. అదే సినిమాలో చిన్న పాత్రలోనూ కనిపించారు. ఆ తర్వాత ‘మాయానది’, ‘తొండిముతలుం దృక్సాక్షియుం’, ‘కుంబళంగి నైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. ఇలా కెమెరా ముందు కనిపించడానికి ముందే కెమెరా వెనుక సినిమా భాషను అర్థం చేసుకున్నారు. 

చిన్న పాత్రలే.. కానీ ప్రత్యేక గుర్తింపు

2013లో వచ్చిన ‘5 సుందరికళ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో నటిగా పరిచయమైన ఉణ్ణిమయ.. ఆ తర్వాత వరుసగా విభిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. ‘మహేషింటే ప్రతీకారం’, ‘అనురాగ కరిక్కిన్ వెల్లం’, ‘తొండిముతలుం దృక్సాక్షియుం’, ‘పరవ’, ‘వరతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ‘ఒరు కుప్రసిద్ధ పయ్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ‘వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వంటి చిత్రాల్లో ఆమె కనిపించారు. 2018లో వచ్చిన ‘ఫ్రెంచ్ విప్లవం’లో వయసు మీదపడిన మహిళ పాత్రను కూడా పోషించారు. 

‘అంజామ్ పాతిరా’.. పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్రతో గుర్తింపు

2020లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘అంజామ్ పాతిరా’ ఉణ్ణిమయ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో ముఖ్యమైన మలుపు. ఇందులో డీసీపీ కేథరిన్ మారియా పాత్రలో ఆమె నటించారు. సీరియస్ పోలీస్ అధికారిణిగా కనిపించిన ఆమె నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పాత్ర తర్వాత ఉణ్ణిమయకు వరుసగా పోలీస్ పాత్రలే రావడం మొదలైంది. అయితే ఒకే రకమైన పాత్రల్లో ఇరుక్కుపోవడం ఇష్టం లేక కొన్ని అవకాశాలను ఆమె తిరస్కరించారు. 2026లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ‘అంజామ్ పాతిరా’ తర్వాత వచ్చిన చాలా ఆఫర్లు పోలీస్ పాత్రలేనని.. టైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాననే ఉద్దేశంతో వాటిలో కొన్ని చేయలేదని చెప్పారు. 
 
‘పడ’.. మరో బలమైన మహిళ

‘జోజి’ తర్వాత వచ్చిన పాత్రల్లో ‘పడ’లోని కేఎస్ మినీ కూడా గుర్తుండిపోయే పాత్ర. 2022లో విడుదలైన ఈ చిత్రం 1996లో జరిగిన అయ్యంకాళి పడ ఘటన ఆధారంగా తెరకెక్కింది. సామాజిక, రాజకీయ నేపథ్యమున్న కథలో ఉణ్ణిమాయ పోషించిన మినీ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కూడా ఆమె నటనలో ఆర్భాటం కనిపించదు. పాత్ర ఎదుర్కొనే పరిస్థితులు, ఆ పాత్రలోని భావోద్వేగం.. వీటినే ముందుకు తెచ్చారు. ‘జోజి’లో ఇంటి వాతావరణంలో కనిపించిన మహిళ.. ‘పడ’లో మరో సామాజిక నేపథ్యంలోని మహిళగా కనిపించడం ఆమె పాత్రల పరిధిని చూపిస్తుంది. 

 అవార్డు తెచ్చిన బిన్సీ 

‘జోజి’లోని బిన్సీ పాత్ర ఉణ్ణిమయ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త స్థాయి తీసుకొచ్చింది. ఈ నటనకు 52వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ క్యారెక్టర్ నటిగా పురస్కారం అందుకున్నారు. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు. ఇంతకాలం చిన్న పాత్రలతో కనిపించిన నటికి.. ఒక పాత్రను ఎంత బలంగా మలచగలదో గుర్తించిన సందర్భం. బిన్సీ పాత్రతో ఉణ్ణిమయ పేరు మలయాళ ప్రేక్షకుల్లో మరింత బలంగా స్థిరపడింది. ఆమెకు ఈ పాత్ర ఎందుకు సరిపోయిందో కూడా ఉణ్ణిమయ స్వయంగా వివరించారు. ఇంతకుముందు ఎక్కువగా చిన్న పాత్రలు చేసిన నటిగా తనను చూసిన ప్రేక్షకులకు ‘జోజి’లో తన పాత్ర ఎంత కీలకమో వెంటనే అర్థం కాకపోవచ్చని చెప్పారు. అదే పాత్రకు ఒక రకమైన సహజత్వాన్ని తెచ్చిందని ఆమె భావించారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Unnimaya Prasad (@unnimango)

‘జోజి’.. బిన్సీగా మరిచిపోలేని ముద్ర

ఉణ్ణిమయ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు చెప్పగానే చాలామంది ప్రేక్షకులకు గుర్తొచ్చే పాత్ర ‘జోజి’లోని బిన్సీ. ఫహాద్ ఫాజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి దిలీష్ పోతన్ దర్శకత్వం వహించారు. ఇందులో బిన్సీ పాత్ర పెద్దగా మాట్లాడదు. కానీ ఆమె మౌనంలోనే చాలా అర్థాలు దాగి ఉంటాయి. ఇంటి పనుల్లో నిమగ్నమై కనిపించే బిన్సీ.. పరిస్థితులను గమనిస్తూ, మనుషుల స్వభావాలను అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు ఎక్కువ డైలాగులు ఉండవు. కానీ చిన్న చూపు, ముఖంలో మారే భావం, ఒక మాట, ఒక చర్య.. ఇలా ప్రతి అంశం పాత్రను ముందుకు తీసుకెళ్తుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Unnimaya Prasad (@unnimango)

©️ VIL Media Pvt Ltd.