Reading Time: < 1 minute

సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పెట్టి చాలా చేయచ్చు..! నిజ జీవితంలో అలా కాదు… 15 ఏళ్ళు కిందామీదా పడాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Caption of Image.

సినిమాల్లో లాగా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పెట్టి అద్భుతాలు చేసినట్టు నిజ జీవితంలో అన్ని సమస్యలు తీర్చలేమని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆదివారం ( అక్టోబర్ 11 ) పోలవరం జిల్లాలో పర్యటించిన ఆయన రంపచోడవరంలో బహిరంగ సభలో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అయితే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పెట్టి రెండున్నర గంటల్లోనే చాలా చేయచ్చని.. నిజం జీవితంలో అలా కాదు, 15 ఏళ్ళు కిందామీదా పడుతూ కష్టపడాలని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

పిల్లలకు ఆరోగ్యం బాగాలేదన్న విషయం కూడా మర్చిపోయి పని చేస్తానని.. ప్రజలంటే తనకు అంత ప్రేమ ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. సిటీల్లో రోడ్లు వేయడం వేరు, గ్రామంలో రోడ్లు వేయడం వేరని అన్నారు. సిటీల్లో తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుందని.. జనాభా ఎక్కువ ఉంటుందని.. గ్రామాల్లో 70 కుటుంబాలు మాత్రమే ఉంటాయని.. ఓట్లు రావని సమస్య పక్కన పెట్టలేదని అన్నారు పవన్ కళ్యాణ్.

ఒక రోడ్డు వేస్తె బిడ్డల భవిష్యత్తు మారిపోతుందని.. అందుకే రోడ్ల కోసం పంతం పట్టుకొని కుర్చున్నానని.. ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు కావాల్సిందేనని అన్నారు.అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించినా తాను రావడానికి కారణం గిరిజన ప్రాంతాలంటే ఇష్టం ఉండటమేనని అన్నారు పవన్ కళ్యాణ్. తనకు అల్లూరి సీతారామరాజు తనకు స్ఫూర్తి అని అన్నారు పవన్ కళ్యాణ్.
 

©️ VIL Media Pvt Ltd.