Reading Time: < 1 minute
Prabhas Movies Postponed Fauji Locked For March 18 Release Spirit Delayed Further

ప్రభాస్ సినిమాలు చెప్పిన టైంకి రావని మరోసారి ఫౌజీతో ఫ్రూవ్ అయ్యింది. డిసెంబర్ బరిలో రావాల్సిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ అవుతోంది. డార్లింగ్ డేట్స్ ఇవ్వడు.. ఇచ్చినా రాకపోవడం వల్ల ఏడాదిలో పూర్తికావాల్సిన సినిమాలు.. రెండు, మూడేళ్లు తీసేసుకుంటున్నాయి. ఫౌజీ విషయంలోనూ ఇదే జరిగింది. అక్టోబర్ నాటికి షూట్ కంప్లీట్ కావాల్సి ఉండగా.. ఇంకా కొంత పోర్షన్ పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది.

ఫౌజీలో యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ప్రజెంట్ ఇంటర్వెల్‌లో వచ్చే టెంపుల్ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్. అలాగే క్లైమాక్స్ షూట్ చేస్తారట. ఓవరాల్‌గా డిసెంబర్ ఎండింగ్ నాటికి ఫౌజీ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఈ మంత్ అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఫౌజీకి నుండి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారట. నెక్ట్స్ ఇయర్ మార్చిలో ఫౌజీని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన స్పిరిట్ కూడా వాయిదా పడబోతున్నట్లే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న స్పిరిట్ మార్చి 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అదే డేట్‌కు సినిమా తెచ్చేయాలని సందీప్ ప్లాన్ చేసుకుంటే ఏం లాభం.. డైనమిక్ డైరెక్టర్‌కు కూడా డేట్స్ ఇవ్వట్లేదు డార్లింగ్. ఈ మూవీ షూటింగ్ స్టార్టై దాదాపు ఏడాది కావొస్తున్నా.. 40 శాతమే షూటింగ్ ఫినీష్ అయ్యింది. ప్రస్తుతం ఫౌజీని ఫినీష్ చేసే పనిలో బిజీగా ఉన్న డార్లింగ్.. నెక్ట్స్ స్పిరిట్‌కు డేట్స్ కేటాయిస్తాడు. షూటింగ్ 2027 సెకండాఫ్‌లో పూర్తి చేయాలనుకుంటున్నాడట సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ బరిలో మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రెండు సినిమాలు తీసుకొచ్చాస్తానని డార్లింగ్ చెబుతోన్న మాటలు.. నీటి మూటలేనా..? చెప్పిన టైంకే రెబల్ స్టార్ సినిమా వస్తుందంటే.. నమ్మలేని పరిస్థితికి ఫ్యాన్స్ వచ్చేశారా..?