Reading Time: < 1 minute
Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

సాంస్కృతిక సంబరాలకు, పండుగ శోభకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బతుకమ్మ. శనివారం ఎంగిలి పూల బతుకమ్మతో పండగ వాతారం మొదలైంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సరికొత్త పాట తెగ ట్రెండ్ అవుతోంది. తెలుగు లోగిళ్లలో బతుకమ్మ పాటల జోరు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన ఒక అచ్చమైన జానపద గీతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 748 వేలకు పైగా వ్యూస్‌ను రాబట్టి యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మాట్లాడుకుంటున్న సాంగ్ ‘బైలెల్లి రాయె బతుకమ్మ’. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. స్వామినరేష్ సమకూర్చిన బాణీలు, కృష్ణుడి మ్యూజిక్ ఈ పాటకు ప్రాణం పోశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తెరకెక్కించిన ఈ పాటలోని సాహిత్యం, లయబద్ధమైన సంగీతం శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, మహిళల బతుకమ్మ ఆటలతో సాగే ఈ వీడియో విజువల్స్ ప్రేక్షకులను పాత రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి.

సాధారణంగా బతుకమ్మ సీజన్‌లో అనేక పాటలు విడుదలైనప్పటికీ, ఈ పాటకు వస్తున్న స్పందన మాత్రం ప్రత్యేకంగా ఉంది. సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్‌లోనూ ఈ పాటకు యువత కనెక్ట్ అవుతుండటంతో వ్యూస్ అంచనాలకు మించి పెరుగుతున్నాయి. తెలంగాణ పల్లెటూళ్ల సంబరాలను, బతుకమ్మ పూల ఘోమఘోమలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. జానపద సంగీతాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్‌లోనూ ఈ సాంగ్ ఇప్పుడు చేరిపోయింది. కేవలం కొద్ది గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్‌ను దాటుతూ దూసుకుపోతున్న ఈ గీతం, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

గతంలో స్వామినరేష్ అందించిన బాసింగ బలాలు సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. తక్కువ సమయంలోనే ఈ పాట నెట్టింట సంచలనం క్రియేట్ చేసింది. ఇఫ్పుడు బాయిలెల్లి సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

బతుకమ్మ సాంగ్..



ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..