Reading Time: < 1 minute

మీరు తినే ఫుడ్ సేఫెనా… ఆహారం తయారీలో గుట్కా, పాన్ మసాలా.. 5 హోటళ్ల లైసెన్సులు రద్దు!

Caption of Image.

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీ అక్రమాలు బయటపడ్డాయి. పరిశుభ్రత పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని  తయారు చేస్తున్న ఐదు సంస్థల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులను రద్దు చేశారు.

ఈ దాడులకు సంబంధించి  స్వాధీనం చేసుకున్న పదార్థాలలో సుమారు రూ. 2.3 లక్షల విలువ చేసే 1,950 కిలోల ఫేని (సేమియా)ని అధికారులు సీజ్ చేశారు. దీనితో పాటు శ్రీ గణేష్ ఖారా & ఫెని (అత్తాపూర్), జేపీ ఫుడ్స్ (జియాగూడ, ఇమామ్ పురా), ప్రేమ్ పూరి స్వీట్ ఫణి షాప్ (చార్మినార్, పెట్ల బుర్జ్), మహావీర్ నమ్‌కీన్ (బడంగ్‌పేట్, నాదర్‌గుల్), జీఎం మిక్చర్ (అత్తాపూర్), అంజనీ ఫుడ్స్ & ఫెని వర్క్స్ (జియాగూడ, భరత్‌నగర్ – ఇది ఎలాంటి లైసెన్సు లేకుండా నడుస్తోంది) మూసివేసారు. 

హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఫేని, ఖారా తయారీ కేంద్రాలపై పోలీసులు, ఆహార భద్రతా అధికారులు కలిసి మొత్తం 12 బృందాలుగా ఏర్పడి ఈ దాడులు నిర్వహించారు.

వంటశాలల్లో తీవ్రమైన అపరిశుభ్రత ఉండటం, ఈగలు వాలడం, ఆహారం తయారు చేసేవారు ఎలాంటి పరిశుభ్రతా పాటించకపోవడం, కీటకాల నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం, సరైన ఆరోగ్య రికార్డులు లేకపోవడం, కొన్ని ఆహార పదార్థాల్లో గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు కలపడం వంటి లోపాలను  గుర్తించి వాటిని పారబోశారు.

నిబంధనలు ఉల్లంఘించిన మరో 6 సంస్థలకు అధికారులు త్వరలో షో-కాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి తనిఖీలను మరింత కఠినతరం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.