Reading Time: < 1 minute

హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామం: మంత్రి వివేక్

Caption of Image.

హైదరాబాద్: హైటెక్ సిటీలో భారత్–జపాన్ స్నేహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు, సాంస్కృతిక అనుబంధాలు, ఆర్థిక సహకారాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుక సాగింది.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామమని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి, వ్యాపార విస్తరణకు నగరం అనేక అవకాశాలను అందిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుస్తోందని వివరించారు.

భారత్‌–జపాన్ మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు.భారత్ ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి సంబంధించిన ప్రస్తావన చేశారు.

భారత్–జపాన్ స్నేహోత్సవం ఇరు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఆర్థిక, పారిశ్రామిక భాగస్వామ్యానికి దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

+

©️ VIL Media Pvt Ltd.