Reading Time: < 1 minute

సీజేపీకి బిగ్ రిలీఫ్… ధృవ్ రాఠీ, అభిజీత్, సౌరవ్, అశుతోష్ విడుదల…

Caption of Image.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమం ఢిల్లీలో ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసింది. సీజేపీ నిరసన పట్ల అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ భారీ పోలీసు బలగాలను మోహరించి, సీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించి నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా అడ్డుకుంది. అయితే.. కీలక నేతల అరెస్టులతో ఢీలా పడ్డ సీజేపీ క్యాడర్ కు ఊరట దక్కింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సీజేపీ చీఫ్ అభిజీత్, సౌరవ్, అశుతోష్ సహా యూట్యూబర్ ధృవ్ రాఠీలను విడుదల చేశారు పోలీసులు.

జంతర్ మంతర్ దగ్గర నిరసనలో పాల్గొనేందుకు సీజేపీ నేతలు ముంబై  నుంచి ఢిల్లీకి చేరుకోగానే విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం కంటోన్మెంట్ అడిషనల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి… అభిజీత్, అశుతోష్, సౌరవ్ లను విడుదల చేశారు. దీంతో కాక్రోచ్ లు ఎప్పటికీ చావవు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది సీజేపీ.మరోవైపు నిరసనలు ప్రారంభం కాకముందే గుర్గావ్ లో అదుపులోకి తీసుకున్న యూట్యూబర్ ధృవ్ రాఠీని కూడా ఇవాళ తెల్లవారుజామున విడుదల చేశారు పోలీసులు. 

ఇదిలా ఉండగా… సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ( అక్టోబర్ 12 ) నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. జ్ఞానేశ్ పదవి నుంచి వైదొలగేంతవరకు తగ్గేది లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ ర్యాలీలో పాల్గొనాలని ఇండియా కూటమి పార్టీలకు, “ఆందోళన చెందుతున్న పౌరులందరికీ” పిలుపునిచ్చిందని… “మోదీ-షా ప్రభుత్వం దేశవ్యాప్తంగా సాగిస్తున్న ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని… భారత ప్రజాస్వామ్య మనుగడపై ఆందోళన ఉన్న ప్రతి భారతీయుడూ ఇందులో పాల్గొనాలని కోరుతున్నామని అన్నారు కేసీ వేణుగోపాల్. 

ఈ ర్యాలీ సన్నాహాల కోసం నిన్న పలువురు నేతలతో సమగ్రంగా సమావేశమయ్యాం. ఇండియా కూటమి ఎంపీలు, నేతలు, కార్యకర్తలు, పౌరులు ‘జ్ఞానేశ్ అండ్ కో’కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపడతారు. ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ మా సీనియర్ నేతల బృందం గౌరవ సీజేఐకి వినతిపత్రం సమర్పిస్తుంది” అన్నారు కేసీ వేణుగోపాల్.

©️ VIL Media Pvt Ltd.