Reading Time: 2 minutes

దసరా ఉత్సవాలు: దుర్గాదేవి అవతారాలు.. ఏ రోజు ఏ పూలతో పూజించాలి..!

Caption of Image.

నవరాత్రి తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఒక్కో రూపానికి ఒక్కో రకమైన పుష్పాన్ని సమర్పించే సంప్రదాయం ఉందిఅమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో రకమైన పుష్పాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తిశ్రద్ధలతో పువ్వులు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నవరాత్రి ఉత్సవాల 9 రోజులు అమ్మవారి పూజలో ఏ రోజు  ఏ పువ్వులు సమర్పించాలో తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో శరదృతు నవరాత్రులకు ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఆశ్వయుజ మాసంలోని శుక్ల పాడ్యమి నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్​ 11 న ప్రారంభయ్యాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని ఆమె తొమ్మిది రూపాల్లో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. నవరాత్రి పూజలో పుష్పాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది.

నవరాత్రుల 9 రోజులు.. అమ్మవారికి సమర్పించాల్సిన పువ్వులు

మొదటి రోజు(  శైలపుత్రి) : శైలపుత్రి దేవికి తెల్ల గన్నేరు పువ్వులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

 రెండో రోజు ( బ్రహ్మచారిణి): బ్రహ్మచారిణి అమ్మవారికి మర్రి పువ్వులు లేదా మందార పుష్పాలను సమర్పించవచ్చని సంప్రదాయంలో చెబుతారు.

 మూడో రోజు(చంద్రఘంట): చంద్రఘంట దేవికి తామర పువ్వులు లేదా పసుపు రంగు పుష్పాలను సమర్పించడం మంచిదని భావిస్తారు.

 నాలుగో రోజు (కూష్మాండ): కూష్మాండ దేవికి మందార లేదా మల్లె పువ్వులను సమర్పించడం శుభప్రదంగా పరిగణిస్తారు.

 ఐదో రోజు ( స్కందమాత): స్కందమాతకు బంతి పువ్వులు, పారిజాతం పుష్పాలను సమర్పించే సంప్రదాయం ఉంది.

ఆరో రోజు(కాత్యాయని): కాత్యాయని దేవికి బంతి పువ్వులు, పసుపు రంగు పుష్పాలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

ఏడో రోజు ( కాళరాత్రి): కాళరాత్రి అమ్మవారికి నీలం రంగు పుష్పాలు, ముఖ్యంగా అపరాజిత వంటి పువ్వులను సమర్పించడం మంచిదని చెబుతారు.

ఎనిమిదో రోజు ( మహాగౌరీ) :మహాగౌరీ దేవికి తెల్లని మొగలి లేదా మల్లె పువ్వులను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

 తొమ్మిదో రోజు( సిద్ధిదాత్రి): సిద్ధిదాత్రి అమ్మవారికి చంపా లేదా మందార పువ్వులను సమర్పించే సంప్రదాయం ఉంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.