Reading Time: < 1 minute
Jr Ntr Resumes Dragon Movie Shooting From Oct 14 At Ramoji Film City

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ బ్రేక్ పడడంతో డీలా పడిన ఎన్టీఆర్ అభిమానులకు ఒక బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. చేతి గాయం వల్ల కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు దాని నుంచి కోలుకోవడంతో మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కొత్త షెడ్యూల్  హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ స్టూడియోలో స్టార్ట్ అయింది. గత 4 రోజులు ఎన్టీఆర్ లేని పోర్షన్స్ షూట్ చేశారు. 14వ తేదీ నుంచి జరగబోయే ఈ తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఎన్టీఆర్ రాకతో చిత్ర బృందం ఈ కొత్త షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యమైన సీన్లను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక ఎన్టీఆర్ రీ-ఎంట్రీ వార్త తెలుసుకున్న అభిమానులు ‘డ్రాగన్’ మూవీకి సంబంధించిన తదుపరి అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కాబోతున్న డ్రాగన్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది.