Reading Time: 2 minutes

సీఎస్‌కే కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సురేష్ రైనా?.. మౌనం వీడిన మిస్టర్ ఐపీఎల్!

Caption of Image.

Suresh Raina: ఐపీఎల్ 2027 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాఫ్‌లో సంచలన మార్పులు చేస్తుంది. 18 ఏళ్ల పాటు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్‌ స్థానంలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించిన సీఎస్‌కే.. బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మని రంగంలోకి దించుతుంది. మరోవైపు గత 8 ఏళ్లుగా బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మైకేల్ హస్సీకి గుడ్‌బై చెప్పడంతో.. ఇప్పుడు కొత్త బ్యాటింగ్ కోచ్ ఎవరు కాబోతున్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సీఎస్‌కే మాజీ బ్యాటర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా (Suresh Raina) చెన్నై బ్యాటింగ్ కోచ్‌గా చేరబోతున్నారా? అనే ప్రచారం జోరందుకుంది. దీనిపై తాజాగా రైనా స్పందించాడు.

సీఎస్‌కే కోచింగ్పై రైనా రియాక్షన్: 

* సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దానిపై నేనేమీ మాట్లాడలేను (I don’t want to comment on that) అంటూ సురేష్ రైనా చిరునవ్వుతో దాటవేశారు. ఈ వ్యాఖ్యను నేరుగా ఖండించకపోవడంతో రైనా సీఎస్‌కే డగౌట్‌లో ప్రత్యక్షమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.

* రైనా సీఎస్‌కే ప్రయాణం: 2008 నుంచి 2015 వరకు, అలాగే 2018 నుంచి 2021 వరకు సీఎస్‌కే వైస్ కెప్టెన్‌గా, ఎంఎస్ ధోనీకి నమ్మకమైన వ్యక్తిగా రైనా జట్టుకు అద్భుత సేవలు అందించాడు. 2022లో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. ఒకవేళ చెన్నై బాధ్యతలు చేపడితే కోచ్‌గా రైనాకు ఇది తొలి ఐపీఎల్ ఇన్నింగ్స్ అవుతుంది.

►ALSO READ | భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ స్పెషల్ జెర్సీ.. 100 ఏళ్ల బంధానికి ప్రత్యేక గుర్తు!

భువీ వచ్చేశాడు.. షమీ కూడా జట్టులోకి రావాల్సిందే: 

ఓ ఇంటర్వ్యూలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) రీ-ఎంట్రీపై కూడా సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున వికెట్ల పండగ చేసుకుంటున్నాడు. భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. భువీ తిరిగి వచ్చినట్లే, షమీ కూడా టీమిండియాలోకి త్వరలోనే రీ-ఎంట్రీ ఇస్తాడని భావిస్తున్నాను.. అతనొక క్వాలిటీ బౌలర్, రంజీల్లో ఎంతో శ్రమిస్తున్నాడు.. 2023 వరల్డ్ కప్‌లో అతని కన్సిస్టెన్సీ ఏంటో అందరూ చూశారని రైనా వెల్లడించాడు. 

బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీ: 

అజిత్ అగార్కర్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) ఇన్-ఛార్జ్/ఇంటరిమ్ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే కొత్త సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌ను బీసీసీఐ ప్రకటించే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. 

 

©️ VIL Media Pvt Ltd.