Reading Time: < 1 minute

ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్

Caption of Image.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌‌ను ప్రపంచపటంలో మరింత ఉన్నతంగా నిలిపేలా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఇన్వెస్ట్​ తెలంగాణ..  గ్లోబల్ సమిట్-2026’ నిర్వహణ ఏర్పాట్లపై సమావేశంలో సీఎం అధికారులతో  చర్చించారు. వచ్చే డిసెంబరులో రంగారెడ్డి జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా ఈ మెగా సమిట్‌‌ను నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.

ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ డెలిగేట్లు, కార్పొరేట్ దిగ్గజాలు హాజరుకానున్న నేపథ్యంలో సమిట్ ఏర్పాట్లు, అతిథుల ఆతిథ్యం, భారీగా పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమ్మిట్ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను తాను త్వరలోనే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని సీఎం వెల్లడించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా, వైద్య ప్రాజెక్టులతో పాటు అంతర్జాతీయ పెట్టుబడుల సాధనలోనూ అధికారులు సమన్వయంతో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కీలక సమీక్ష సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, స్పెషల్​ సీఎస్​, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు పలువురు సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.