Reading Time: < 1 minute
IND vs WI 3rd ODI: చండీగఢ్ వన్డేలో భారత్‌కు షాక్.. మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం

భారత్, వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. శనివారం న్యూ చండీగఢ్‌లోని మహారాజా యద్వింద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్‌‌పై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్‌ ఇచ్చిన 352 పరుగుల టార్గెట్‌ను వెస్టిండీస్‌ 48.2 ఓవర్లలోనే చేధించి.. విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సిరీస్‌ను మాత్రం..భారత్‌కే దక్కింది. మొత్తం మూడు వన్డేల్లో తొలి రెండు వన్డేల్లో పై చేయి సాధించిన భారత్ 2-1తేడాలో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

అయితే తొలుత టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసి వెస్టిండీస్‌ ముందూ 352 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ ప్లేయర్లలో కేఎల్ రాహుల్ 129, రోహిత్ శర్మ 92, గైక్వాడ్ 57 పరుగులు చేయడంతో ఇండియా భారీ స్కొర్ చేయగలిగింది. అయినప్పటికీ.. లక్ష్య చేధనలో బరిలోకి దిగిన వెస్టిండీస్.. ఈ స్కోర్‌ను ఈజీగా చేధించగలిగింది.

వెస్టిండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్ షాయ్ హోప్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడుతూ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 162 పరుగులు సాధించి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. అతనికి తోడుగా అమీర్ జాంగూ 67, కీమో పాల్ 44 విలువైన సహకారాన్ని అందించడంతో విండీస్ 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్లతో విజయం నమోదు చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.