Reading Time: < 1 minute

హార్టికల్చర్ పై చంద్రబాబు మాటలు డ్రామాలు.. రైతులపై ప్రేమ ప్రచారానికే పరిమితం: వైఎస్ జగన్ 

Caption of Image.

ఏపీలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన సందర్భంగా మదనపల్లి సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. హార్టికల్చర్ పై చంద్రబాబు మాటలు డ్రామాలని..బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు జగన్. రైతులపై చంద్రబాబు ప్రేమ ప్రచారానికే పరిమితమని.. చంద్రబాబు పాలనలో ధరల స్థిరీకరణ నిధి నిర్వీర్యమైందని అన్నారు జగన్.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకం రద్దు చేశారని అన్నారు. రాయలసీమలో 7-8 లక్షల బోర్లు ఎండిపోయాయని.. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డంకి అని అన్నారు జగన్. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరువు నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు జగన్. 

తీవ్రమైన కరువు కారణంగా  రాయలసీమలో ఇప్పుడు తీవ్ర దుర్భిక్షం నెలకొంటే, వేలాది ఎకరాల్లో హార్టికల్చర్‌ తోటలు ఎండిపోతుంటే,  మీరు వాటర్‌ మ్యాన్‌ అని బిల్డప్‌ ఇవ్వడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఇక హార్టికల్చర్‌ హబ్‌ సంగతి పక్కనపెడితే, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా  రాయలసీమ సహా రాష్ట్రం మొత్తం తయారయ్యిందని… మీ డ్రామాలు, బిల్డప్‌లు కట్టిపెట్టి, రైతులకు ఊరటనిచ్చేలా తక్షణమే కరువు నివారణా చర్యలు మొదలుపెట్టండని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జగన్.

©️ VIL Media Pvt Ltd.