
CJP: కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ((CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు.
అయితే, సీజేపీకి స్థానిక ముంబై వాసుల నుంచి షాక్ తగిలింది. శివాజీ పార్క్‌లోని స్థానిక నివాసితులు సీజేపీ కార్యక్రమం నిర్వహించొద్దని చెప్పారు. ఓ వైపు పోలీసులు నో చెప్పినా కూడా సీజేపీ శివాజీ పార్క్‌లోనే ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీజేపీ టీమ్ శివాజీ పార్క్ చేరుకోగానే అక్కడ నుంచి వెళ్లిపోవాలని స్థానికులు కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, సీజేపీ సభ్యుడు దీనిపై మాట్లాడుతూ.. వీరంతా స్థానిక నివాసితులేనా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పంపించారా? అనే అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఈ పరిణామంపై సీజేపీ తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. ‘‘కాక్రోచ్ జనతా పార్టీకి బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగా పంపించిన వ్యక్తులు సీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని పోస్ట్ చేసింది. మరోవైపు ముంబై బీజేపీ తాము స్థానికులకు మద్దతుగా ఉన్నట్లు ఎక్స్‌లో ప్రకటించింది.
శివాజీ పార్క్ వద్ద నిరసనలకు అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పులు, మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా శబ్ధకాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, సమీప ఆస్పత్రులకు అంతరాయం ఏర్పడుతుందనే కారణాలను అధికారులు ప్రస్తావించారు. మరోవైపు, సీజేపీ కార్యక్రమానికి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు మద్దతు ప్రకటించారు.
कॉकरोच जनता पार्टी के लोगों को भाजपा के कार्यकर्ताओं से परमिशन लेने की कोई जरूरत नहीं है,
यह कुछ लोग जानबूझकर भेजे गए हैं और इससे यह दिखाने की कोशिश की जाएगी की सीजेपी वालों का विरोध हो रहा है,
लेकिन युवा इनके झांसे में नहीं आने वाले हैं,जेल भरो मार्च सफलतापूर्वक व शांतिपूर्ण…
— Cockroaches of India (@CJP_for_India) September 29, 2026