Reading Time: < 1 minute

NTR Trivikram: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్ రెడీ… త్రివిక్రమ్ గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు!

Caption of Image.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఆ అంచనాలే వేరు. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబో మళ్లీ పట్టాలెక్కబోతోంది. ఈసారి వీరు అందించబోయే విజువల్ వండర్ మాములుగా ఉండబోదు. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కలబోతగా తమిళ కడవుల్ ‘లార్డ్ మురుగన్’ (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చేసుకుని అత్యంత ప్రతిష్టాత్మక  తెరకెక్కించనున్నారు.

 భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్  లేటెస్ట్ గా కీలక అప్డేట్ అందించారు. విక్టరీ వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైందని చెప్పారు. వెండితెరపై ఇదివరకెన్నడూ చూడని రీతిలో తారక్‌ను ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా పేరు ఖరారు చేయనప్పటికీ ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిలింనగర్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.

►ALSO READ | Vijay Leo Cafe: విజయ్ ‘లియో’ కేఫ్‌కు పెరిగిన డిమాండ్.. ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఇదే!

ఈ భారీ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్‌కు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండటం మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ ‘ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న తారక్, ఆ తర్వాత ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో అడుగుపెడతారు. 2027లో ప్రారంభం షూటింగ్ కానుంది. ఈ విశ్వరూప విజువల్ ప్రాజెక్ట్, పాన్-వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్ , సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.