
సాంకేతిక పరిజ్ఞానం కొన్నిసార్లు ఊహించని పొరపాట్లతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బెంగళూరులోని ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ కెమెరా చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూటర్‌పై వీపున గిటార్ తగిలించుకుని వెళ్తున్న ఒక వ్యక్తిని, వెనుక హెల్మెట్ లేకుండా కూర్చున్న రెండో మనిషిగా ఆ ఏఐ కెమెరా భావించి రూ. 500 ఫైన్ విధిస్తూ చలానా పంపింది! సౌవిక్ దత్తా అనే వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్‌లో స్కూటర్‌పై వెళ్తుండగా, కెమెరా తీసిన ఫొటో ఆధారంగా “వెనుక ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదు” అని జరిమానా విధించారు. ఈ అనూహ్య ఫైన్‌తో షాకైన ఆయన, ఆ ఫొటోను షేర్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశీలించగా అది మనిషి కాదని, కేవలం గిటార్ బ్యాగ్ అని తేలింది. ఈ ఘటనపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పందిస్తూ, పరిశీలించి పొరపాటును సరిదిద్ది చలాన్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో కారు డ్రైవర్‌కు హెల్మెట్ లేదని ఫైన్ వేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి తప్పుడు చలాన్లు పడితే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ ఘటన ఏఐ వ్యవస్థల కచ్చితత్వంపై మళ్లీ చర్చకు దారితీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!
అమరావతిలో అద్భుత నిర్మాణాలు.. ఐకానిక్ టవర్ల వెనుక ఇంజినీరింగ్ అద్భుతాలు
Chedi Gang: హైదరాబాద్‌పై మళ్లీ చెడ్డీ గ్యాంగ్ పంజా
దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్