Reading Time: < 1 minute

6 నెలలుగా రేషన్ తీసుకోని వారికి షాక్.. అక్టోబర్ నుంచి కార్డులు రద్దు..?

Caption of Image.

న్యూఢిల్లీ: రేషన్ కార్డుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ ఆహార ధాన్యాల ప్రయోజనం అందేలా చూడటంతో పాటు పీడీఎస్ డేటాబేస్‌ను మరింత కచ్చితంగా నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టనుంది. ఇందులో భాగంగా.. గత ఆరు నెలల్లో రేషన్ కార్డ్ ద్వారా బియ్యం, ఇతర వస్తువులు తీసుకోని దాదాపు 1.58 కోట్ల రేషన్ కార్డులను 2026, అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు సమాచారం. అయితే, లబ్దిదారుల పేర్లను వెంటనే ప్రభుత్వ డేటా బేస్ నుంచి తొలగించరు. 

లబ్ధిదారులకు మూడు నెలల సమయం ఇస్తారు. ఈ వ్యవధిలో లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి తాము అర్హులమని నిరూపించుకుంటే కార్డులను తిరిగి యాక్టివేట్ చేస్తారు. ఈ చర్య ద్వారా రేషన్ సరుకులు వాస్తవంగా అవసరమైన అర్హులైన కుటుంబాలకే చేరేలా చేయడంతో పాటు, పీడీఎస్‌లోని యాక్టివ్‎గా కార్డులను గుర్తించి డేటాబేస్‌ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

►ALSO READ | బ్యాంకులు, ఈకామర్స్ సైట్స్ పంపే బిజినెస్ వాట్సాప్ మెసేజీలకు ఛార్జీలు.. ఎంతంటే?

ఈ విధానంపై కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ తీసుకోని కారణాన్ని ముందుగా తెలుసుకోకుండా, కార్డును ఉన్నఫలంగా ఆపివేయడంతో నిజమైన లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. సాంకేతిక సమస్యలు, వలసలు వంటి కారణాలతో కొందరు లబ్ధిదారులు రేషన్ తీసుకోలేరు. అటువంటి కార్డులను రద్దు చేస్తే లబ్దిదారులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.