Reading Time: < 1 minute

 సున్నం చెరువు, తుమ్మిడి కుంట చెరువుల చుట్టూ..  ఫుట్‌పాత్‌లు, లైటింగ్.. రోడ్డు కనెక్టివిటీ

Caption of Image.

హైదరాబాద్: సున్నం చెరువు, తుమ్మిడి కుంట అభివృద్ధి పనులపై జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్  జరిగింది. సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ శ్రీజనతో పాటు జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్  ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని సున్నం చెరువు, తుమ్మిడి కుంట పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల పరిధిలో ఉన్న పనులను పరస్పర సమన్వయంతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

సున్నం చెరువు వద్ద కల్వర్ట్ వరకు సెంట్రల్ మీడియన్‌ను పొడిగించడంతో పాటు, చెరువు నుంచి కల్వర్ట్ వరకు ఫుట్‌పాత్‌ను విస్తరించనున్నారు. చెరువు చుట్టూ ఆర్నమెంటల్ ఇల్యూమినేషన్, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.అలాగే పర్వత్‌నగర్ నుంచి సున్నం చెరువుకు మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కల్పించేలా అవసరమైన పనులను చేపట్టాలని నిర్ణయించారు.

►ALSO READ | 6 నెలలుగా రేషన్ తీసుకోని వారికి షాక్.. అక్టోబర్ నుంచి కార్డులు రద్దు..?

తుమ్మిడి కుంట వద్ద బ్యాక్ ఎంట్రన్స్ నుంచి ఏసీ బస్‌స్టాప్ వరకు ఫుట్‌పాత్ కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. కుంట చుట్టూ ఆర్నమెంటల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, తుమ్మిడి కుంట నుంచి సింధు హాస్పిటల్‌కు కనెక్టింగ్ రోడ్డు అభివృద్ధి చేయనున్నారు.స్మైలిన్ డెంటల్ వైపు ఉన్న ఔట్‌లెట్ డ్రెయిన్‌కు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టే అంశంపైనా సమావేశంలో సమీక్షించారు.

అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

©️ VIL Media Pvt Ltd.