Reading Time: 2 minutes

మనిషి శరీరాన్ని ముక్కలుగా నరికి.. నరనరాల్లో వణుకు పుట్టించేస్తున్న ‘మయూఖ’ ట్రైలర్!

Caption of Image.

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో శ్రీ తేజ్ ఎస్.కె దర్శకత్వంలో వస్తున్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘మయూఖ’ (Mayukha)  . భారీ అంచనాల మధ్య అక్టోబర్ 9న తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ పతాకంపై శశిధర్ ఈ మూవీని నిర్మించారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ ట్రైలర్ చూస్తుంటే క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

ఈ మూవీ ట్రైలర్ ప్రారంభంలోనే చూపించే సీన్ షాకింగ్ కు గురిచేస్తుంది.  హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 44లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వేలాడదీశారని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందుతుంది. దీంతో పోలీసులు ఘననాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలిస్తారు. అక్కడ చెత్తను పడేసే నల్లటి కవర్లలో మనిషి శరీర భాగాలు ముక్కలుగా కనిపించడంతో షాక్ కు గురిచేస్తుంది. దీంతో ఈ కేసు మరింత సీరియస్ గా ఆసక్తిరంగా మారుతుంది.  ఈ ఒక్క సీన్‌తోనే థ్రిల్లర్ లవర్స్‌కు ఒళ్ళు గగుర్పొడిచే రేంజ్‌లో కట్స్ పడ్డాయి.

మరో వైపు అర్ధరాత్రి పూట తన ఇంటి తలుపు ఎవరో పదేపదే కొడుతున్నారంటూ పాయల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు వచ్చి విచారిస్తే విస్తుపోయే నిజం బయటపడుతుంది. ఓ సైకో అమ్మాయి నరరూప రాక్షసిలా మనుషులను నరికి ముక్కలు చేయడం తాను ప్రత్యక్షంగా చూశానని పాయల్ చెప్పడంతో సస్పెన్స్ పీక్స్‌కు చేరుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? నగరంలో వరుసగా పడుతున్న శవాలకు, పాయల్‌కు ఉన్న సీక్రెట్ కనెక్షన్ ఏంటి? దానికితోడు ఊరిలో వింతగా కోళ్లు మాయమవ్వడానికి ఈ నరమేధానికి ఉన్న లింక్ ఏంటనేది థ్రిల్లింగ్లిగా చూపించారు.

నరనరాల్లో వణుకు పుట్టించే సీన్లు, గూస్‌బంప్స్ తెప్పించే స్క్రీన్‌ప్లే ఈ సినిమాలో ఉన్నాయిఅని హీరోయిన్ పాయల్ చెంగప్ప ధీమా వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వేరే లెవల్లో ఉన్న ఈ ‘మయూఖ’… అక్టోబర్ 9న థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ థ్రిల్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.