
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో రష్యా సైనిక విమానం (Tu-95 బాంబర్) కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరొకరు గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తూర్పు అముర్ ప్రాంతంలోని క్రాస్నోయరోవో గ్రామానికి సమీపంలో మంగళవారం (సెప్టెంబర్ 29) ఈ ప్రమాదం జరిగింది.
సాంకేతిక కారణాలతో టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఇందులో ఆరుగురు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. జనవాసాలు లేని ప్రదేశంలో విమానం కుప్పకూలడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేప్టటారు.
►ALSO READ | పాక్‌తో దోస్తానా అంతే ఉంటది మరీ: బంగ్లాకు ఊహించని షాకిచ్చిన పాకిస్థాన్
ఫ్లైట్ క్రాష్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో.. కుప్పకూలగానే విమానం ఇంధనం ట్యాంకులు పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగడం కనిపించింది.