
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సినిమాలతో పాటు విభిన్నమైన కథలు, పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది అంజలి. కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే వ్యక్తిగత విషయాల్లో మాత్రం పెద్దగా స్పందించని అంజలి.. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అంజలి వయసు 40 దాటడంతో ఆమె పెళ్లిపై అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తి మరింత పెరిగింది. అంజలి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.?, ఆమె పెళ్లి చేసుకునేది ఎవరిని? అంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై ప్రశ్న ఎదురవడంతో అంజలి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వామ్మో.. ఆమె ఈమే ఒక్కరేనా..? ప్యారడైజ్‌లో కీలక పాత్ర.. ఈ నటిని బయట చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!
పెళ్లి విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అంజలి స్పష్టం చేసింది. తన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని తానే తీసుకుంటానని, సరైన సమయం అనిపించినప్పుడు మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపింది. నా పెళ్లి విషయంలో మీరెందుకు ఎందుకు అంత తొందరపడుతున్నారో తనకు అర్థం కావడం లేదు అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. తన జీవితంలో పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగతమైన నిర్ణయమని, అందరి అంచనాలకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపింది అంజలి. అంజలి తన స్నేహితుల గురించి చెప్పిన మాటలు మాత్రం అందరినీ నవ్వించేలా ఉన్నాయి. తన పెళ్లి గురించి తనకంటే తన ఫ్రెండ్స్‌కే ఎక్కువ ఆసక్తి ఉందని ఆమె సరదాగా పేర్కొంది.
మహేష్ బాబు, ప్రభాస్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
పెళ్లి వేడుక అంటే తన స్నేహితులకు కొత్త బట్టలు వేసుకోవడం, ఫొటోషూట్‌లు చేయించుకోవడం, సందడి చేయడం వంటి విషయాలే గుర్తొస్తాయని అంజలి నవ్వుతూ చెప్పింది. అయితే వాళ్ల సరదా కోసం తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. తన ఫ్రెండ్స్‌కు తాను ఇచ్చే సమాధానం కూడా చాలా ఫన్నీగా ఉంటుందని అంజలి తెలిపింది . పెళ్లి చేసుకోవాలనే అంత ఆసక్తి ఉంటే ముందుగా వాళ్లే పెళ్లి చేసుకోవాలని చెబుతానన్నారు. వాళ్ల పెళ్లికి తాను మంచి డ్రెస్ వేసుకుని వచ్చి ఫొటోషూట్‌లో పాల్గొంటానని, కానీ కేవలం వాళ్ల సరదా కోసం మాత్రం తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అంజలి స్పష్టం చేసింది. అంజలి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. మొత్తానికి.. అంజలి పెళ్లి గురించి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.
ఆ హీరో చాలా గొప్పోడు.. స్కూటర్ మీద తిరిగే నాకు కారు కొనిచ్చాడు.. అది ఇప్పటికీ నాతోనే ఉంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.