Reading Time: < 1 minute

LNG train: దేశంలోనే తొలి LNG గ్యాస్ రైలు పట్టాలెక్కింది.. గుజరాత్ లోని సబర్మతి నుంచి పరుగులు

Caption of Image.

దేశంలో తొలి LNG ఆధారిత రైలు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్‌లోని సబర్మతి నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా , గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ జెండా ఊపి ప్రారంభించారు. మార్పిడి చేసిన1400 HP డ్రైవింగ్ పవర్ కార్లలో (DPCలు) డీజిల్- LNG డ్యూయల్-ఫ్యూయల్ సిస్టమ్‌ను ఉపయోగించడం  ద్వారా ఈ ట్రైన్ నడుస్తుంది. ద్రవీకృత సహజ వాయువు సాంప్రదాయ డీజిల్ వినియోగాన్ని 40శాతం వరకు తగ్గించవచ్చు. కార్బన్ డయాక్సైడ్ ,నైట్రోజన్ ఆక్సైడ్‌ల వంటి ఉద్గారాలను కూడా తగ్గించడమే కాకుండా, డీజిల్‌ దిగుమతిపై  ఆధారపడకుండా ఇంధన ఖర్చులను తగ్గిస్తుంది. ప్రయోగానికి ముందు 2వేల కిలోమీటర్లకుపైగా విజయవంతమైన క్షేత్ర పరీక్షలను పూర్తి చేశారు అధికారులు. 

ఎలా నడుస్తుంది..?

మార్పిడి చేసిన ప్రతి DPCలో సుమారు 2వేల200 లీటర్ల సామర్థ్యం గల LNG ట్యాంక్ ఉంటుంది. ఇది దాదాపు 850నుంచి 900 కిలోల ఉపయోగపడే LNGని నిల్వ చేయగలదు. ఒక LNG ఫిల్ చేస్తే  16వందల  కిలోమీటర్ల ఆపరేషన్‌కు ప్రయాణిస్తుందని అంచనా.
ఆదివారం ఉదయం హోంమంత్రి అమిత్ షా సబర్మతిలో రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన WAG-12 లోకోమోటివ్ నిర్వహణ షెడ్‌ను ప్రారంభించి అనంతరం  WAG-12 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

►ALSO READ | కాక్రోచ్ల నిరసనకు సోనం వాంగ్చుక్ మద్ధతు.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహించాల్సిందే

©️ VIL Media Pvt Ltd.